Viral: పాముని తినేసిన కప్ప.. అయితే అది మలద్వారం నుంచి బయటకు వచ్చేసింది?

వినడానికి కాస్త జుగుప్సాకరంగా వున్నా, మీరు విన్నది నిజమే.సోషల్ మీడియా వైరల్ వీడియోలకు అడ్డాగా మారిపోయింది.

 Frog Eats Snake Coming Out Of The Frogs Anus Viral-TeluguStop.com

ముఖ్యంగా ఇక్కడ అనునిత్యం కొన్ని రకాల జంతువులకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఎక్కువగా వైరల్ కావడం మనం గమనించవచ్చు.ఆస్ట్రేలియా గురించి అందరికీ తెలిసినదే.

ఆ దేశం ప్రమాదకర పాములు, ఇతర సరీసృపాలకు నిలయంగా చెప్పుకోవచ్చు.అక్కడ విభిన్న జాతులు పాములు (Snakes) తరచుగా కనిపిస్తూ ఉంటాయి.

అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా కనిపించిన ఓ పాముకు సంబంధించిన ఘటన నెటిజన్లను అవాక్కయేలా కనబడుతోంది.

బేసిగ్గా పాములు కప్పలను (Frogs) తింటాయని మనం విన్నాం.కానీ ఇక్కడ సీన్ రివ్సర్సయింది.అవును, ఓపాము పిల్లను కప్ప మింగేయడం ఇక్కడ చూడవచ్చు.

అక్కడితో అయిపోయిందా అంటే లేదు… ఆ పాము ఆ కప్ప ముడ్డిలోనుండి బయటకు పొడుచుకు రావడం ఇక్కడ వైరల్ అవుతున్న ఫోటోలో స్పష్టంగా చూడవచ్చు.కాగా ఆస్ట్రేలియాకు (Australia) చెందిన ఓ మహిళ సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ అవుతోంది.

అది ప్రమాదకర ఈస్ట్రన్ బ్రౌన్ పాము పిల్లని ఆ ఫోటోల ద్వారా తెలుస్తుంది.

కప్ప దానిని మింగినప్పటికీ ఆ పాము పిల్లను విసర్జించడం ఇక్కడ షాకింగ్ విషయం.గోల్డ్‌కోస్ట్‌కు 400కిలోమీటర్ల దూరంలో ఉన్న గూండివిండిలో ఈ ఘటన చోటుచేసుకోగా స్థానికంగా చర్చనీయాంశం అయింది.కాగా ఈ ఘటనపై నెటిజన్స్ మిక్కిలి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇదేం కప్పరా బాబోయ్? ఇలాంటి కప్పను మేము ఎక్కడా చూడలేదు అని కామెంట్స్ చేస్తున్నారు.ఇకపోతే ఇవి గ్రీన్ ట్రీ ప్రాగ్స్(కప్పలు).

ఇవి సాధారణంగా సాలెపురుగులు, బల్లులు, బొద్దింకలను తింటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube