మాజీ మంత్రి విజయరామారావు(VijayaramaRao) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు.ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది.
పరిస్తితి విషమించటంతో.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు తుది శ్వాస విడిచారు.
85 సంవత్సరాల వయసు కలిగిన విజయరామారావు మంత్రిగా అదే విధంగా. సీబీఐలో డైరెక్టర్ గా కూడా పనిచేయడం జరిగింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు.1999 వ సంవత్సరంలో కాంగ్రెస్ అభ్యర్థి పీజేఆర్ పై పోటీ చేసి గెలిచి చంద్రబాబు(Chandrababu Naidu) క్యాబినెట్ లో మంత్రి పదవి అందుకోవటం జరిగింది. 2009లో పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత.రాష్ట్ర విభజన జరిగిన అనంతరం టిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఆ తర్వాత కొంతకాలానికి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.దీంతో విజయరామారావు మృతి పట్ల సీఎం కేసీఆర్ (KCR)దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.ప్రభుత్వ అధికారిగా, ప్రజా ప్రతినిధిగా విజయరామారావు అందించిన ప్రజా సేవలు గొప్పవని కొనియాడారు.
ఉమ్మడి రాష్ట్రంలో అనంతరం తెలంగాణ రాష్ట్రంలో విజయ రామారావు తో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా సీఎం స్మరించుకున్నారు.వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఇదే సమయంలో వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.అంతేకాదు విజయరామారావు అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంచనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చూసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారిని సీఎం ఆదేశించారు.