వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ లో కీలక అంశాలు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తనను అరెస్ట్ చేయకుండా ఉండేలా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

 Ys Viveka's Daughter Sunitha Reddy's Key Points In The Impleaded Petition-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కోర్టులో దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్ లో కీలక అంశాలు ఉన్నాయని తెలుస్తోంది.అవినాశ్ రెడ్డి ద్వారా దస్తగిరితో పాటు మిగిలిన నిందితులకు డబ్బులు చేరాయని సునీత ఆరోపిస్తున్నారు.

సునీల్ యాదవ్ గూగుల్ టేకౌట్ లోకేషన్ ఆధారంగా వివేకా హత్యకు ముందు అవినాశ్ ఇంట్లో ఉన్నారని చెప్పారు.అవినాశ్ రెడ్డి ఇంటికి పలుమార్లు సునీల్ యాదవ్ వెళ్లారని పిటిషన్ లో పేర్కొన్నారు.2017లో ఎమ్మెల్సీ ఎన్నికలలో వివేకాను కావాలనే ఓడించారన్నారు.2019 ఎంపీ ఎలక్షన్స్ లో వివేకాకు టికెట్ ఇస్తున్నారనే సమాచారంతోనే హత్య చేశారని పిటిషన్ లో సునీతారెడ్డి ఆరోపణలు చేశారు.వివేకా హత్య గురించి అవినాశ్ రెడ్డికి ముందే తెలుసని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలోనే హత్య కాదు.సాధారణ మరణం అని చిత్రీకరించే ప్రయత్నం చేశారని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube