తెలంగాణలో ఎయిర్ పోర్టు మెట్రో కారిడార్ నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి.ఈ నేపథ్యంలో నెల రోజుల వ్యవధిలోనే పనులు ప్రారంభం అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ఎయిర్ పోర్ట్ మెట్రో కారిడార్ ప్రాజెక్టును మూడేళ్ల గడువులోగా పూర్తి చేయాలని లక్ష్యంతో ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే సర్వేను అధికారులు పూర్తి చేశారు.
అలైన్ మెంట్ కు అనుగుణంగా పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.కాగా మెట్రో రెండో దశ విస్తరణలో భాగంగా కారిడార్ -3లోని నాగోల్ -రాయదుర్గం మార్గానికి అనుసంధానంగా శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు పనులు చేపట్టనున్న సంగతి తెలిసిందే.







