అనుకున్నదే జరిగింది.ఎప్పటి నుండి మన ఇండియా మొత్తం ఎదురు చూస్తున్న ఆస్కార్ అవార్డ్స్(Oscar Award) ఈవెంట్ పూర్తి అయ్యింది.
మరి ఈ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును మన ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాట(Naatu Naatu Song) గెలుచుకుని సంచలనం సృష్టించింది.ఈ వేడుక ఎప్పుడెప్పుడు వస్తుందా.
మన సినిమా ఈసారైనా అవార్డు గెలుచు కుంటుందా లేదా అని అంతా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.
మరి ఎట్టకేలకు ఈ అవార్డ్స్ లో మన సినిమా కూడా అవార్డు గెలుచుకోవడం ఇప్పుడు అందరికి గర్వకారణంగా ఉంది.
ఇది ఒక చరిత్ర అనే చెప్పాలి.ఇక ఈ వేడుక కోసం ఆర్ఆర్ఆర్ టీమ్ అక్కడికి ముందుగానే చేరుకుంది.
ముందు నుండే యూఎస్ లో సందడి చేస్తూ పలు ఇంటర్వ్యూలు చేస్తూ ఈ సినిమాపై మరింత క్రేజ్ పెంచారు.
మరి ఈ వేడుక కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రత్యేక డ్రెస్ లలో వెళ్లారు.మన తెలుగు హీరోలు ఎన్టీఆర్, చరణ్ అలా ఆస్కార్ రెడ్ కార్పెట్ మీద నడుచుకుంటూ వెళ్లి అందరిని అలరించారు.మరి ఇదే సమయంలో ఇక్కడ ఒక ఆసక్తికర సంఘటన జరిగింది.
ఈ వేడుకలో ఎన్టీఆర్ (NTR) ధరించిన డిజైనర్ డ్రెస్ అందరి దృష్టిని ఆకట్టుకుంది.
ఈ వేడుక కోసం ఎన్టీఆర్ పులిబొమ్మతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన సూట్ ధరించారు.ఈ పులిబొమ్మ డ్రెస్ కే హైలెట్ అయ్యింది.దీంతో పులి బొమ్మపై ఆస్కార్ నిర్వాహకుల కన్ను పడి దీని గురించి అడిగారు.
ఎందుకు ఆ బొమ్మ వేసుకొచ్చారు? అని ఎన్టీఆర్ ను అడుగగా.ఆర్ఆర్ఆర్ లోని పులిని చూసారు కదా.నాటో పాటు అది కూడా కనిపించింది.నిజానికి మా భారత జాతీయ జంతువు పులి.
నేను మా దేశ సింబల్ తో రెడ్ కార్పెట్ మీద నడవడం నాకు గొప్పగా ఉంటుంది అని చెప్పడంతో ఆస్కార్ యాంకర్ మిమ్మల్ని చూస్తే సౌత్ ఏసియా మొత్తం గర్వపడుతుందని కామెంట్స్ చేయడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ అయ్యింది.