మెంతుల సాగుతో సస్యరక్షణ పద్ధతులు.. మేలు రకం విత్తనాలు ఇవే..!

మెంతికూర(fenugreek)కు ఏడాది పొడవునా మార్కెట్లో డిమాండ్ ఉండడమే కాక భారతదేశం నుండి ఇంగ్లాండ్, సౌదీ అరేబియా, శ్రీలంక లాంటి ఎన్నో దేశాలకు ఎగుమతి అవుతుంది.మెంతుల సాగుకు ఎటువంటి వాతావరణ పరిస్థితి అయినా అనుకూలమే.

 Plant Protection Methods With Cultivation Of Fenugreek These Are The Best Types-TeluguStop.com

కానీ అధిక వర్షపాతం గల ప్రదేశాలు అంతగా అనుకూలంగా ఉండవని చెప్పాలి.ఎక్కువగా బంక మట్టి, క్షార గుణం ఉండే నేలలో సాగు చేస్తే దిగుబడి మెరుగుగా ఉంటుంది.

ఇక పంట వేశాక 100 నుండి 110 రోజులలో చేతికి వచ్చి, సుమారు ఒక మీటర్ పొడవు పెరుగుతుంది.మెంతులు సాగు చేయాలి అనుకునేవారు మేలు రకం విత్తనాలను ఎంపిక చేసుకోవాలి.

కసూరి(Kasuri), ఆర్ ఎం టి 143, ఆర్ ఎంటి 1, రాజేంద్ర క్రాంతి, హెచ్ 103 వంటి మేలు రకం విత్తనాలు ఆశించి స్థాయిలో దిగుబడి అందిస్తాయి.వేసవికాలంలో పొలాన్ని రెండు లేదా మూడుసార్లు బాగా దుక్కి దున్నాలి.

ఒక హెక్టార్కు దాదాపుగా 25 కిలోల విత్తనాలు అవసరం.తరువాత నేలను మడుల రూపంలో చేసుకుని విత్తనాలను రైజోబియం కల్చర్ తో శుద్ధిచేసి పొలంలో చల్లాలి.

విత్తనాలు(seeds) చల్లిన ఎనిమిది రోజుల తర్వాత మొలకలు రావడం గమనించవచ్చు.ముఖ్యంగా గమనించుకోవలసినది ఏమిటంటే వరుసల మధ్య 20 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు నాటుకోవాలి.తర్వాత ఒక హెక్టారుకు దాదాపు 12 టన్నుల సేంద్రియ ఎరువు వేసుకోవాలి.వీటితోపాటు 50 కిలోల పోటాష్, 10 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం ఎరువులను విత్తుకునే సమయంలో వేసుకోవాలి.తర్వాత ఆకులు కత్తిరించిన ప్రతిసారి నత్రజని ఎరువును వేసుకోవాలి.10 రోజులకు ఒకసారి క్రమం తప్పకుండా నీటిని పారించాలి.వాతావరణం లో మార్పులు గమనిస్తూ, ఎప్పటికప్పుడు కలుపు మొక్కలను తొలగిస్తూ ఏమైనా సందేహాలు ఉంటే వ్యవసాయ క్షేత్ర నిపుణుల సలహాలు తీసుకొని పాటిస్తే మంచి దిగుబడి సాధించి, మంచి ఆదాయం అర్జించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube