నిమ్మ తోటల్లో ప్రధానంగా కలుపు సమస్యలు ఎక్కువ.కలుపు వల్ల పంటకు తీవ్ర నష్టం కలుగుతుంది.
అయితే వ్యవసాయ క్షేత్రం నిపుణులు నిమ్మ తోటలను(lemon grove) సందర్శించి, పార్థినియం అనే కలుపు ప్రధాన సమస్యగా మారుతుందని గమనించారు.అంతేకాకుండా పశువుల ఎరువు వాడినప్పుడు, చెరువు మట్టి తోలినప్పుడు, ఇంకా ఇతర కారణాలవల్ల కలుపు విత్తనాలు పొలాల్లోకి వచ్చి విపరీతంగా పెరుగుతున్నాయని తెలిపారు.
కాబట్టి కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించి పంటను సంరక్షించుకోవాలి.

నిమ్మ తోటల్లో కలుపు మొక్కలు 5 లేదా 6 అంగుళాలు పెరిగాక సూపర్ ఫాస్ఫేట్ పొడి(Super phosphate powder) నాలుగు కిలోలకు, యూరియా ద్రావణాన్ని రెండు లీటర్లు కలిపి అడుగు భాగం వరకు తడిచేలా పిచికారి చేయాలి.తర్వాత కలుపు మొక్కలను వేర్ల తో సహా పీకి, ఒక గుంతలో వేసి దానిపై గాలి చొరబడకుండా బురదతో కప్పివేయాలి.ఆ కలుపు అంతా కుళ్లిపోయే సమయంలో అందులో ట్రైకోడెర్మా విరిడి అనే పొడి మందులు మూడు కిలోలు చల్లాలి.45 రోజుల తర్వాత పోషకాలు ఉన్న కంపోస్ట్ ఎరువు(Compost manure) ఏర్పడుతుంది.ఇందులో వానపాముల ద్వారా వర్మి కంపోస్టు ఎరువుగా తయారు చేయవచ్చు.

నిమ్మ తోటకు మట్టి అవసరం అయినప్పుడు కలుపు లేని ప్రాంతం నుండి సేకరించిన మట్టిని మాత్రమే తోటల్లో వేసుకోవాలి.దీని ద్వారా కలుపు ఉదృతి తగ్గుతుంది.ఇక లేత కలుపు మొక్కలపై ఉప్పు ద్రావణాన్ని ఐదు శాతం పిచికారి చేయాలి.నిమ్మ తోటల్లో మొక్కకు 6 * 6 దూరంలో సాగు చేయడం వల్ల మొక్కలకు సరైన రీతిలో సూర్యరశ్మి, గాలి చేరి మొక్క దృఢంగా పెరుగుతుంది.
మొక్కల మధ్య ఉండే ఖాళీ స్థలంలో పది మిల్లీమీటర్ల గ్లైఫోసిట్, 10 గ్రాముల అమోనియం సర్ఫేట్ కలిపి రూపంలో కలుపు పై పిచికారి చేయాలి.ఈ ద్రావణం నిమ్మ మొక్క (lemon plant)మొదలపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
నిమ్మ తోటల్లో కలుపు సమస్య ఎంత తగ్గించుకుంటే అంతకుమించిన రీతిలో దిగుబడి పొందవచ్చు.కాబట్టి నిమ్మ తోట రైతులు వ్యవసాయ క్షేత్ర నిపుణుల సలహాతో సస్యరక్షణ పద్ధతులు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.







