కేజీఎఫ్ సినిమా తో దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్.ప్రస్తుతం ఈయన ప్రభాస్ హీరోగా సలార్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే, ఆ వెంటనే ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమా ను చేయాల్సి ఉంది.
ఈ రెండు సినిమా లు వెంటనే చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని దర్శకుడు ప్రశాంత్ భావించాడు.కానీ ఇప్పటి వరకు సలార్ సినిమానే పూర్తి కాలేదు.
ఈ సంవత్సరంలో ఆ సినిమా వస్తుందా లేదా అనేది కూడా తెలియడం లేదు.ఇంతటి గందరగోళ పరిస్థితులు కేవలం తెలుగు హీరో ల సినిమాలకి మాత్రమే ఉంటాయని ఆయన ఇప్పటికీ అర్థం చేసుకొని ఉంటాడు అంటూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

కేజీఎఫ్(KGF) సినిమా చేసిన సమయంలో ప్రశాంత్ నీల్(Prashanth Neil) కి ఎలాంటి ఇబ్బంది రాలేదు, కానీ ప్రభాస్(Prabhas) తో సినిమా చేస్తున్నప్పుడు రెండు సంవత్సరాలుగా తీవ్రమైన సమస్యలను ఆయన ఎదుర్కొంటున్నాడు.ప్రస్తుతం ప్రభాస్ అనారోగ్య కారణాలతో షూటింగ్ కి దూరంగా ఉంటున్నాడు.ఆ కారణంగా మరో మూడు నాలుగు నెలల పాటు సలార్(Salar) సినిమా షూటింగ్ కార్యక్రమాలు జరిగే పరిస్థితి లేదు.ఇక ఎన్టీఆర్ తో సినిమా మొదలు పెడితే ఎలా ఉంటుందో అంటూ ఇప్పటి నుండే ఆయన టెన్షన్ పడుతున్నారట.
మొత్తానికి తెలుగు హీరోలతో సినిమాలు చేయాలని పెట్టుకుంటే చాలా పెద్ద డ్యామేజ్ జరుగుతుందని తన కెరీర్ లో చాలా సమయం వృధా అవుతుందని ఆయన స్నేహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.అయితే బాలీవుడ్ హీరోలతో చేసినా రాని గుర్తింపు మన తెలుగు హీరోలతో సినిమాలు చేస్తే వస్తుంది.
అందుకే ఆయన వెయిట్ చేసినా కూడా మంచి గుర్తింపు, మరింత భారీ విజయాలను సొంతం చేసుకునే అవకాశం ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







