ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమం

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపళ్లి మండలంలో తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) ముఖ్య నాయకుల సమావేశం మండల అధ్యక్షుడు కడారి రాంరెడ్డి(Kadari Ram Reddy) ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన సిరిసిల్ల నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆవునూరి దయాకర్ రావు మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ఆదేశాల మేరకు చేపట్టిన ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ, సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అపూర్వమైన స్పందన లభిస్తుందన్నారు.

 Door-to-door Telugu Desam Party Program, Rajanna Sirisilla, Telugu Desam Party,-TeluguStop.com

ఈ నెల 17 వ తేదీన తంగళ్లపళ్లి మండలంలో ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తీగల శేఖర్ గౌడ్,గ్యాధ సత్తయ్య, పయ్యావుల లక్ష్మణ్,పంజా బాలరాజు, కడారి లక్ష్మీ, టిఎన్ఎస్ఎఫ్ నాయకులు మోతె రాజిరెడ్డి, సత్తవ్వ, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube