దొంగతనం చేసి అదే ఇంట్లో నిద్రపోయిన దొంగ.. ఇంటి యజమాని డోర్ ఓపెన్ చేశాక ఏమైందంటే..?

దొంగతనం చేసిన నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ఎన్నో ప్లాన్లు, నిఘాలు వేస్తారు .చోరీకి వెళ్ళిన వారు చాలా జాగ్రత్తలు తీసుకొని చిన్న క్లూ కూడా ఇవ్వకుండా అటు పోలీసులను, ఇటు దొంగతనం జరిగిన కుటుంబాన్ని గందరగోళంలో పడేశారు.

 The Thief Who Stole And Slept In The Same House. What Happened When The Owner Of-TeluguStop.com

కానీ ఓ దొంగ ఒక ఇంట్లో చోరీ చేసి పోలీసులకు, దొంగతనం జరిగిన కుటుంబానికి పెద్దగా టెన్షన్ పెట్టకుండా చాలా ఈజీగా దొరికిన ఘటన చెన్నైలో(Chennai) జరిగింది.చోరీకి వెళ్ళిన దొంగ( Thief) , మద్యం మత్తులో దొంగతనం పూర్తిచేసి, కాస్త ఆకలిగా ఉండడంతో ఇంట్లో ఉండే ఆహారాన్ని తిని అక్కడే నిద్రలోకి జారుకున్నాడు.

పోలీసుల కథనం ప్రకారం చెన్నైలోని అడయారు ప్రాంతం(Udaipur )లో ఒక భవనంలోని మూడవ అంతస్తులో కార్తీక్ నరేన్ అనే వ్యక్తి, రెండవ అంతస్తులు అతని తల్లిదండ్రులు నివాసం ఉంటున్నారు.కొన్ని రోజుల కిందట తల్లిదండ్రులు తీర్థయాత్రలకు వెళుతూ ఫ్లాట్ కీ నరేన్ కి ఇచ్చారు.

ఈనెల తొమ్మిదవ తేదీ తల్లిదండ్రులు తిరిగి వస్తారని రెండవ అంతస్తులో ఉండే తల్లిదండ్రుల ప్లాట్ తాళం తీసి ఉంచి, నరేన్ మూడవ అంతస్తుని తన ఇంటికి వెళ్ళాడు.అదే రోజు రాత్రి ఇంట్లో ఎవరో నిద్రపోతున్నారని ఇంటికి అర్ధరాత్రి చేరుకున్న నరేన్ తల్లిదండ్రులు పసిగట్టారు.ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి నిద్ర లేపగా ఒక్కసారిగా షాక్ అయి బయటికి పరుగులు తీసి మరో ఇంట్లోకి దూరాడు.నరేన్ తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.అతని వద్ద రూ.41,000 నగదు, 20 విదేశీ కరెన్సీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు.నిందితుడు తిరువణ్ణామలై ప్రాంతానికి చెందిన ఏళుమలై గా గుర్తించారు.ఇంటి తలుపులు తెరిచి ఉండడం వల్ల దొంగతనం చేసి, ఇంట్లో ఉండే ఆహారం తిని నిద్రపోయినట్లు బయటపడడంతో కోర్టులో (Court)హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube