ప్రజాస్వామ్యంలో వైసీపీ ఓ రోల్ మోడల్ అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.అమరావతి వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ వేడుకలలో ఆయన పాల్గొన్నారు.
తండ్రి బాటలోనే సీఎం జగన్ ముందుకు వెళ్తున్నారని సజ్జల తెలిపారు.ప్రజల అజెండానే సీఎం జగన్ అజెండా అని చెప్పారు.
అనినీతి లేకుండా ప్రజలకు పారదర్శక పాలన అందిస్తున్నారన్నారు.మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారని పేర్కొన్నారు.
ప్రజలకు జవాబుదారీగా సీఎం జగన్ ప్రభుత్వం నడుస్తోందన్నారు.గతంలో కాంగ్రెస్ ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా జగన్ ప్రజలు కోసం పోరాడారని తెలిపారు.
ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా వైసీపీని ఏమీ చేయలేరని సజ్జల స్పష్టం చేశారు.







