జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది.ఎందుకంటే ఢిల్లీకి వెళ్లిన కవిత(Kavitha) వెంట ఏడుగురు మంత్రులు ఉన్నారు.
వారందరి తో టచ్ లో ఉన్న కేసీఆర్ (KCR) ఉదయం నుంచి సాయంత్రం వరకు మినిట్ వివరాలను తెప్పించుకుంటున్నారని తెలుస్తుంది.ఇది దాదాపు 8 గంటల పాటు కవితను విచారణ చేయడం కూడా టిఆర్ఎస్ శ్రేణులను కొంత ఆందోళన పరచినట్టుగా తెలుస్తుంది.
ఇంత సేపు విచారణ జరిగిందంటే అరెస్టు కూడా ఉంటుందేమో అన్న అనుమానాలు పార్టీ శ్రేణులకు వచ్చినట్టుగా తెలుస్తుంది ఈ పరిస్థితులు పార్టీ క్యాడర్ యొక్క మనోభావాలను కూడా దెబ్బతీస్తాయని, వారి ఆత్మ విశ్వాసం తగ్గుతుందేమో అన్న చికాకు కూడా కేసీఆర్లో కలుగుతున్నట్లుగా సమాచారం.మొదటినుంచి దూకుడు అయిన పోరాటాలకు పెట్టింది పేరైన కెసిఆర్ సొంత కూతురు ఎదురైన ఈ పరిస్థితికి కొంత ఇబ్బంది పడుతున్నట్టే కనబడుతుంది .

అయితే చట్టానికి సంబంధించిన విషయం కాబట్టి దాన్ని చట్టబద్ధంగానే ఎదుర్కోవాలని అందరికీ ధైర్యం చెబుతూ అవసరమైన ఏర్పాటుల చూస్తున్నారు .ఒకపక్క హరీష్ రావు(Harish rao) కేటీఆర్ తో రోజంతా మాట్లాడుతూ అక్కడ జరుగుతున్న విషయాలపై తీసుకోవలసిన చర్యలపై వారికి సూచనలుచేస్తూనే , మరొకపక్క హైదరాబాదులో బండి సంజయ్ వ్యాఖ్యలపై నిరసనలు, ఈడీ కార్యాలయం ఎదుట నిరసనలు ద్వారా కేంద్రం చర్యలకు ప్రతి చర్యలను సిద్ధం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది.

తన విషయ లోనో లేదా తన కుమారుడు విషయంలోనో ఇలా జరిగి ఉంటే బహుశా ఎదుర్కోవడానికి ఆయనకంత ఇబ్బంది కలిగి ఉండేది కాదు కానీ కుమార్తె విషయం కావడంతో సెంటిమెంట్ యాంగిల్ ఉండడంతో మానసికంగా ఆయన కొంత అస్థిరతకు గురవుతున్నట్లుగా తెలుస్తుంది.ముఖ్యమంత్రి అయినా కూడా తండ్రి ప్రేమ దానిని డామినేట్ చేస్తున్నట్టుగా ఈ విషయాలు గమనిస్తున్న వారు అభిప్రాయపడుతున్నారు.ఏది ఏమైనప్పటికీ ఇంతవరకు వచ్చిన తర్వాత వెనకడుగు వేయకూడదని కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవాలని పూర్తిస్థాయిలో సిద్దామవ్వాలని బారసా(Brs) పార్టీ కూడా నిర్ణయించుకున్నట్టుగా అర్థమవుతుంది…మరి తర్వాత జరగనున్న పరిణామాలు ఎలా ఉంటాయో వాటి పర్యవసానాలు పార్టీ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.







