ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ సంచలన నిర్ణయం తీసుకుంది.వర్సిటీ సిబ్బంది, విద్యార్ధుల మధ్య సన్నిహిత సంబంధాలను నిషేధించింది.
ఈ మేరకు బీబీసీ నివేదించింది.ఈ ఏడాది ఏప్రిల్ 17 నుంచి కొత్త నిబంధన అమల్లోకి వస్తుందని వర్సిటీ తెలిపింది.
విద్యార్ధులతో వ్యక్తిగత సంబంధాలపై ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఎప్పటికప్పుడు సిబ్బందికి తెలియజేస్తూనే వుంటుందని నివేదిక పేర్కొంది.కొత్త నిబంధనను ఉల్లంఘించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి కూడా ప్రత్యేక పాలసీని రూపొందించినట్లుగా తెలుస్తోంది.
ఇప్పటి వరకు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో సిబ్బంది, విద్యార్ధుల మధ్య సంబంధాలు అనుమతించబడ్డాయి.అయితే ఈ విధానం వల్ల వర్సిటీ ఆవరణలో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయని పెద్దలు గుర్తించారు.
సన్నిహిత సంబంధం వున్న విద్యార్ధి, సిబ్బంది ఎటువంటి బాధ్యతను అందుకోలేదని సంస్థ నిర్ధారించింది.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని(Oxford University) విద్యార్ధి సంఘం ‘‘ఇట్ హ్యాపెన్స్ హియర్ ’’(It Happens Here) అనే యాంటీ సెక్సువల్ అసాల్ట్ గ్రూప్ చేసిన డిమాండ్‌లను అనుసరించి యాజమాన్యం ఈ నిషేధం విధించినట్లుగా తెలుస్తోంది.ఇలాంటి సంబంధాలు అసమానతలకు దారితీయడంతో పాటు విద్యా ప్రక్రియలో విశ్వాసాన్ని బలహీనపరుస్తుందని విద్యార్ధి సంఘం హెచ్చరించింది.ఇప్పటికే యూకేలో యూనివర్సిటీ కాలేజ్ లండన్, యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్‌హామ్ తదితర ప్రఖ్యాత విద్యాసంస్థలు విద్యార్ధులు, సిబ్బంది మధ్య సన్నిహిత సంబంధాలను నిషేధించాయి.

ఇదిలావుండగా.విందుల సమయంలో కప్పులు, ప్లేట్‌లను విద్యార్ధులు దొంగతనం చేస్తున్నట్లు తేలడంతో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అనుబంధంగా వున్న రెండు కాలేజీలు అప్రమత్తమయ్యాయి.మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ (Former Prime Minister Boris Johnson)చదువుకున్న బల్లియోల్ కాలేజ్‌లో క్రెస్టెడ్ కప్పులు, ప్లేస్‌మ్యాట్‌లు దొంగతనం చేసినట్లుగా గుర్తించారు.ఈ నేపథ్యంలో అలాంటి వాటిని డిన్నర్ సమయాల్లో ఉపయోగించరాదని ఆ కాలేజ్ యాజమాన్యం నిర్ణయించుకుంది.
పలువురు విద్యార్ధులు వస్తువులను అక్రమంగా తరలించడానికి ప్రయత్నిస్తూ పట్టుబడినట్లు కాలేజ్ తెలిపింది.ఇక మాగ్డలెన్ కళాశాల(Magdalen College) సైతం దొంగిలించబడిన టేబుల్‌వేర్‌ను తిరిగి ఇవ్వకపోతే.దానిని దొంగతనంగా పరిగణిస్తామని విద్యార్ధులను హెచ్చరించింది.







