పీపీఎఫ్‌, ఈపీఎఫ్‌ స్కీమ్స్‌లో ఏది ఉపయోగకరం అంటే?

మనలో చాలామందికి ఉద్యోగులకి ఈ డౌట్ అనేది సహజంగానే ఉంటుంది.పీపీఎఫ్‌, ఈపీఎఫ్‌ స్కీమ్స్‌లో ఏది ఉపయోగకరం అని.

 Which Of The Ppf And Epf Schemes Is Beneficial, Ppf, Epf, Difference, Latest New-TeluguStop.com

ఉద్యోగులకు తమ చివరి రోజులను దృష్టిలో ఉంచుకొని ఆర్థిక అవసరం నిమిత్తం ప్రభుత్వం EPF (ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్), PPF (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్) పథకాలను లాంచ్‌ చేసిన సంగతి మనందరికీ తెలిసినదే.ఈ రెండూ ఉద్యోగుల కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న సేవింగ్స్‌ స్కీమ్స్.

ఇందులో ఈపీఎఫ్‌ అకౌంట్‌ అనేది ప్రైవేట్ రంగంలోని ఉద్యోగులకు మాత్రమే ఓపెన్‌ చేస్తారు.అదే విధంగా పీపీఎఫ్‌ అనేది ఆర్గనైజ్డ్‌, అనార్గనైజ్డ్‌ సెక్టార్లకు చెందిన ఉద్యోగులకోసం కేటాయించింది.

Telugu Beneficial, Benifits, Difference, Latest-Latest News - Telugu

ఈ రెండు స్కీమ్‌లు లాంగ్‌ టర్మ్‌ కార్పస్‌ ఫండ్‌ అందించే లక్ష్యంతో రుపోయిందినప్పటికీ వీటి మధ్య చాలా తేడాలు చాలా ఉన్నాయి.పీపీఎఫ్‌ అనేది ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రోగ్రామ్‌.ఈ స్కీమ్‌కు ప్రభుత్వం సపోర్ట్‌ ఉంటుంది.ఇక ఇది ఉద్యోగ హోదాతో సంబంధం లేకుండా ఏ భారతీయ పౌరుడైనా ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు.ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పీపీఎఫ్‌లో పెట్టుబడి పెడితే ప్రతి త్రైమాసికంలో వడ్డీ రేటును ప్రభుత్వం ప్రకటిస్తుంది.పీపీఎఫ్ వడ్డీ రేటు ప్రస్తుతం 7.1 శాతంగా ఉంది.పోస్టాఫీసులలో లేదా బ్యాంకులలో PPF అకౌంట్‌ ఓపెన్‌ చేసుకొనే వీలుంది.

Telugu Beneficial, Benifits, Difference, Latest-Latest News - Telugu

ఇక ఈపీఎఫ్‌ విషయానికొస్తే, ఆర్గనైజ్డ్‌ సెక్టార్‌లో పని చేస్తున్న ఉద్యోగుల కోసం ప్రభుత్వం ఈ సేవింగ్స్‌ స్కీమ్‌ను తీసుకొచ్చింది.ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ 1956 ద్వారా ఏర్పాటైన ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈ స్కీమ్‌ను నిర్వహిస్తుంది.EPFO ప్రతి సంవత్సరం వడ్డీ రేట్లను ప్రకటిస్తుంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ అకౌంట్‌పై 8.10 శాతం వడ్డీని అందజేస్తున్నారు.EPF లేదా PF అనేది EPF యాక్ట్‌ కింద నమోదైన కంపెనీలు లేదా వ్యాపార సంస్థల్లో పనిచేసే కార్మికులు లేదా ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube