నానితో పోటీపడి ఆ విషయంలో పరువు పోగొట్టుకున్న యాంకర్... అసలేమైందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ గా గుర్తింపు పొందిన నాని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అసిస్టెంట్ డైరెక్టర్గా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నాని అష్టా చమ్మా సినిమా ద్వారా హీరోగా మారాడు.

 The Anchor Who Lost His Reputation By Competing With Nani ,nani ,dussehra Movie-TeluguStop.com

ఆ తర్వాత నాని నటించిన సినిమాలు అన్ని వరుసగా హిట్ అవటంతో స్టార్ హీరోగా మంచి గుర్తింపు పొందాడు.ఇదిలా ఉండగా ప్రస్తుతం నాని దసరా సినిమా ప్రమోషన్ పనులలో బిజీగా ఉన్నాడు.

ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల చెన్నైకి వెళ్లిన నాని పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నాడు.అక్కడ ఇంటర్వ్యూలో భాగంగా నానీతో ఓ యాంకర్ ఛాలెంజ్ చేసింది.

అయితే ఆ చాలెంజ్ లో యాంకర్ పరిస్థితి చూసి నెటిజన్స్ నవ్వుకుంటున్నారు.ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇటీవల చెన్నైకి వెళ్ళిన నాని అక్కడ లిటిల్ టాక్స్ అనే ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో దసరా మూవీ ట్రైలర్ లో నాని మందు బాటిలో చేతితో పట్టుకోకుండా నోటితో గడ గడా తాగే సీన్ గురించి ప్రస్తావించాడు.

ఆ సమయంలో చేత్తో పట్టుకోకుండా అలా ఎలా తాగారు? అని యాంకర్ ప్రశ్నించింది.అంతే కాకుండా మీకు ఇష్టమైతే ఆ సీన్ ఇక్కడ చేద్దామా? అని నానిని అడిగింది.దానికి నానీ ఓకే చెప్పడంతో వెంటనే రెండు కూల్ డ్రింగ్ బాటిల్స్ తెప్పించింది .

ఆ తరువాత నానికి ఒకటి ఇచ్చి తాను ఒక బాటిల్ తీసుకుంది.చాలెంజ్ ప్రారంభించడానికి ముందే బాటిల్ నోట్లో పెట్టుకొని ఎలా తాగాలో ఆమెకి నాని తెలిపాడు.ఆ తర్వాత ఇద్దరూ బాటిల్స్ తీసి నోట్లో పెట్టుకున్నారు.

తల పైకి ఎత్తేలోపు యాంకర్ ఒక్కసారే ఉక్కిరి బిక్కిరి అయ్యింది.వెంటనే కూల్ డ్రింక్ మొత్తం ఉమ్మేసి బాబోయ్ తన వల్ల కాదని ఒప్పేసుకున్నారు.

నాని మాత్రం కూల్ డ్రింగ్ గడ గడా తాగారు.ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

దీంతో యాంకర్ పై పంచ్ లు, సెటైర్లు వేస్తూ మీమ్స్ తో నెటిజన్లు ఆడేసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube