Aadi Saikumar : డైరెక్టర్ మహా కామెంట్స్ పై ఘాటుగా స్పందించిన హీరో ఆది సాయికుమార్?

దర్శకుడు వెంకటేష్ మహా.వారం రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ పేరు మారుమోగుతున్న విషయం తెలిసిందే.

 Aadi Saikumar Reacts On Venkatesh Maha Comments Over Kgf-TeluguStop.com

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు వెంకటేష్ మహా కేజీఎఫ్ సినిమాపై షాకింగ్ కామెంట్స్ అభ్యంతరమైన కామెంట్స్ చేసి వివాదాల్లో నిలిచిన విషయం తెలిసిందే.దాంతో నెటిజెన్స్ ట్రోలింగ్స్ చేయడంతో పాటు దర్శకుడు వెంకటేష్ మహా పై మండిపడ్డారు.

ఈ విషయం గురించి పలువులు సెలబ్రిటీలు సైతం స్పందించిన విషయం తెలిసిందే.సినిమా బాగా లేకపోతే బాగోలేదని చెప్పాలి కానీ ఇలా బూతులు జోడించి ఆ సినిమాలను విమర్శించడం సరైన పద్ధతి కాదని.

Telugu Aadi Sai Kumar, Tollywood, Venkatesh Maha-Movie

రెండు మూడు సినిమాలు తీసిన నీకు కేజీఎఫ్ సినిమా గురించి మాట్లాడే అర్హత లేదు అంటూ నెటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.అదే విషయంపై వెంకటేష్ మహా స్పందిస్తూ.తాను బూతులు మాట్లాడినందుకు క్షమాపణలు కోరుతున్నానని, కానీ తన అభిప్రాయానికి అంతే కట్టుబడి ఉంటానని తెలిపాడు వెంకటేష్.ఏదో విధంగా బూతులు మాట్లాడినందుకు సారీ చెప్పడంతో ట్రోలర్స్ కాస్త వెనక్కి తగ్గారు వెంకటేష్ మహా.ఇది ఇలా ఉంటే తాజాగా టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ వెంకటేష్ మహా చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.ఈ సందర్భంగా ఆది సాయికుమార్ మాట్లాడుతూ.

Telugu Aadi Sai Kumar, Tollywood, Venkatesh Maha-Movie

ఆ డైరెక్టర్ ఏమని కామెంట్ చేశాడో అది అతని పర్సనల్ ఒపీనియన్.కానీ.నా వరకు వస్తే.కేజీఎఫ్ అనేది కన్నడ ఇండస్ట్రీ హిట్.అది ట్రెండ్ సెట్టర్ మూవీ.అంతేకాకుండా మూవీ కలెక్షన్స్.

ఎంత చేసింది.ఎంతమంది చూశారు? అక్కడే సమాధానం దొరికేసింది.కన్నడ వాళ్లకు అది బిగ్గెస్ట్.అది అందరికి నచ్చాలని రూల్ లేదు.కేజీఎఫ్ నచ్చలేదని చెబితే మాత్రాన అది ప్లాప్ అవ్వదు.అది చేయాల్సిన హవా చేసేసింది.

సక్సెస్ అంత ఈజీ కాదు.అలాగంటే.

సక్సెస్ కొట్టేవన్ని కేజీఎఫ్ లు అయిపోవు కదా,సో.దాని గురించి నేనేం కామెంట్ చేయదల్చుకోవట్లేదు అని తెలిపారు హీరో ఆది సాయికుమార్.

కాగా హీరో ఆది సాయికుమార్ మొదట ప్రేమ కావాలి సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికి ఆశించిన స్థాయిలో ఆది సాయికుమార్ కి గుర్తింపు దక్కలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube