యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr) తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వం లో రూపొందబోతున్న విషయం తెలిసిందే.కొరటాల శివ గత చిత్రం మెగాస్టార్ చిరంజీవి తో రూపొందిన విషయం తెలిసిందే.
ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.అందుకే ఎన్టీఆర్ తో సినిమా కు కొరటాల శివ కాస్త ఎక్కువ సమయాన్ని తీసుకున్నాడు.
దాదాపు సంవత్సర కాలం పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ నిర్వహించిన కొరటాల శివ ఎట్టకేలకు షూటింగ్ కి రెడీ అయ్యాడు.ప్రస్తుతం ఆస్కార్ అవార్డు వేడుకల కోసం ఎన్టీఆర్ అమెరికా లో ఉన్నాడు.
వారం రోజులు తర్వాత ఆయన ఇండియా కు వచ్చే అవకాశాలున్నాయి.ఈ క్రమంలో ఎన్టీఆర్ రాగానే సినిమా మొదలు పెట్టాలని కొరటాల శివ భావిస్తున్నాడట.
గత నెలలోనే సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించాలని భావించినప్పటికీ తారకరత్న మృతి చెందడంతో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడం జరిగింది.

ఇప్పుడు ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డు వేడుక లో పాల్గొనడం కోసం అమెరికా లో ఉన్నాడు.ప్రస్తుతం హైదరాబాద్ శివారు లో ఒక భారీ సెట్టింగ్ ని దర్శకుడు కొరటాల శివ(koratala siva) వేయిస్తున్నాడు.ఎన్టీఆర్ అమెరికా నుండి వచ్చే లోపు ఆ సెట్టింగ్ నిర్మాణం పూర్తయి రెగ్యులర్ షూటింగ్ కార్యక్రమాలు అందులోనే జరగబోతున్నాయి.

దాదాపు మూడు వారాల పాటు ఆ సెట్ లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందని చిత్ర యూనిట్ సభ్యుల్లో కొందరు చెబుతున్నారు.ఈ సినిమా లో హీరోయిన్ గా అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్( janhvi kapoor) నటిస్తున్న విషయం తెలిసిందే.ఇటీవలే ఒక పోస్టర్ ను విడుదల చేసి మరీ చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.బాలీవుడ్ నుండి టాలీవుడ్ కి దిగుమతి అవుతున్న ఈ ముద్దుగుమ్మ ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకం వ్యక్తం అవుతుంది.







