తెలుగు సినిమా వాళ్లకు ఏమైంది ..ఎందుకు చిల్లర తగాదాలు

ఒక వైపు కెజిఎఫ్ సినిమా పై కేరాఫ్ కంచెరపాలెం దర్శకుడు మహా వెంకటేష్ చేసిన వ్యాఖ్యలకు మరో వైపు ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం రాజమౌలి లాబీయింగ్ ల కోసం 80 కోట్ల ఖర్చు చేసాడని చేసిన వ్యాఖ్యలతో టాలీవుడ్ అంత చిల్లర వివాదాలతో నిండిపోయింది.కరోనా కు ముందు శ్రీరెడ్డి చేసిన హడావిడి తర్వాత ఆ రేంజ్ లో మళ్లి హడావిడి ఇప్పుడే కనిపిస్తుంది.

 How Telugu Industry Facing Problems Venkatesh Maha Tammareddy Nagababu Rrr Detai-TeluguStop.com

ఆస్కార్ వచ్చిన, రాకపోయినా మనకు వచ్చే లాభం లేదు కానీ మధ్యలో అందరు దూరిపోయి ప్రతి విషయాన్నీ పెంట చేస్తున్నారు.అందుకు తోడు ఈ సోషల్ మీడియా వీరులకు కొదవ లేదు.

కత్తి పట్టకుండా యుద్దానికి వెళ్లే ఫెసులే అన్ని.

Telugu Venkatesh Maha, Raghavendra Rao, Kgf, Nagababu, Rajamouli, Rrr Oscar Awar

అయినా రాజమౌళి ఆయనకు నచ్చిన సినిమా తీసుకుంటాడు.80 కోట్లు కాకపోతే 180 కోట్లు ఖర్చు పెట్టుకుంటాడు.ఇందులో బయట వారికి ఏం నొప్పి.

ఆస్కార్ అవార్డు కాకపోతే భాస్కర్ అవార్డు ఆయనే కొత్తది పెట్టుకుంటాడు.పోనీ తమ్మారెడ్డి ఎదో వాగాడు అనుకుందాం.

నాగబాబు నీ అమ్మ మొగుడు అనే భాషకు తానే బ్రాండ్ అంబాజిడర్ అయినట్టు రాజకీయాలకు తావిచ్చేలా పిచ్సి వ్యాఖ్యలు చేయడం మరింత అగ్ని కి ఆజ్యం పోసినట్టు గా ఉంది.దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సైతం ఎదో ట్వీటాడు.

సరే ఇదంతా ఒక పక్కన పెడితే ఆర్ ఆర్ ఆర్ అనగానే ఇంతా మంది యుద్ధానికే బయలుదేరినట్టు మాట్లాడుతున్నారు.

Telugu Venkatesh Maha, Raghavendra Rao, Kgf, Nagababu, Rajamouli, Rrr Oscar Awar

మరి ఒక కన్నడ సినిమాను తెలుగు యువ దర్శకుడు కామెంట్స్ చేస్తే వీరంతా అప్పుడు ఏమైపోయారు.అతడిని ఒక్కరు కూడా సమర్ధించలేదు.అతడు మీలో ఒకడే కదా.పైగా మాజీ మంత్రి రఘువీరా రెడ్డి సోదరుడి కొడుకు కూడా.రాజాకీయాలు అప్పుడు కనిపించలేదా.

ఏది ఏమైనా నెత్తి మాశిన పంచాయితీలకు ఇప్పుడు టాలీవుడ్ కేరాఫ్ అడ్డ్రస్సు అయిపోయింది.ఇప్పటికే సినిమ థియేటర్ల గోల, డిస్త్రియుటర్ల గోల, హీరోల ఫ్యాన్స్ గోలలు, టికెట్ రేట్ల గోల, మీటు గోల, సినిమాల్లో రాజకీయ పంచాయితీలు కావని ఇప్పుడు ఈ చిల్లర పంచాయితులు ముందు పెట్టుకొని కూర్చున్నారు.

పర్ సపోజ్ రాజమౌళి ఆస్కార్ తేకుండా ఇండియా కు వస్తే మళ్లి సేమ్ లొల్లి షురూ అవుద్దేమో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube