త్వరలో తెలంగాణలో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికలను బీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ సీరియస్ గానే తీసుకున్నారు.మూడోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే పట్టుదలతో ఉన్నారు.
దీనికి తోడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే ముందుగా తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే దేశవ్యాప్తంగా పార్టీకి మనుగడ ఉంటుందని, లేకపోతే ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాలనే అంచనా తో కెసిఆర్ ఉన్నారు.అందుకే ప్రజల్లోకి పార్టీని తీసుకు వెళ్ళడంతో పాటు, మూడోసారి అధికారంలోకి వచ్చే విధంగా అన్ని వర్గాల ప్రజల్లోనూ బీఆర్ఎస్ పై ఆదరణ పెంచే విధంగా కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటికే పార్టీ నాయకులను ప్రజల్లో ఉండే విధంగా ఆదేశించారు.

తాను తరచుగా జిల్లాలు, నియోజకవర్గాల వారీగా పర్యటిస్తున్నారు.ఇక రాబోయే ఎన్నికల్లో టికెట్ల విషయంలో పార్టీ నేతలు నుంచి అనేక రకాల ఒత్తిళ్లు వస్తున్నాయి ఈసారి జరగబోయే ఎన్నికల్లో తమ వారసులకు టికెట్ ఇవ్వాలని సీనియర్ నాయకులు నుంచి ఒత్తిడి వస్తోంది.అయితే టిక్కెట్ల విషయంలో కెసిఆర్ ఎటువంటి మొహమాటలకు వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారు.
స్థానికంగా మంచి పేరు ఉన్నవారికి టికెట్లు ఇవ్వాలని, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు, ప్రజల్లో మంచి గుర్తింపు , కచ్చితంగా గెలుస్తారు అనుకున్న వారికి టిక్కెట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నారట.

ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలలో చాలామందికి టికెట్ దక్కి అవకాశం కనిపించడం లేదు.ఇక ఒకే కుటుంబం నుంచి రెండు టిక్కెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో, ఒక కుటుంబానికి రెండు టిక్కెట్ లు ఇచ్చేది లేదని కెసిఆర్ ఇప్పటికే తనపై ఒత్తిడి చేస్తున్న వారికి చెప్పారట.ఏదో ఒక కుటుంబానికి ఈ రకంగా టిక్కెట్ ఇచ్చినా.
మిగిలిన వారు టిక్కెట్ల విషయంలో ఒత్తిడి తీసుకొస్తారని కెసిఆర్ భావిస్తున్నారట.టికెట్ల విషయంలో కఠినంగా వ్యవహరించకపోతే, ఆ ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుందని, ఇప్పటికే బిఆర్ఎస్ ను ఓడించేందుకు కాంగ్రెస్, బిజెపిలు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తుండడం , కేంద్ర అధికార పార్టీ బిజెపి పూర్తిగా బీఆర్ఎస్ కీలక నాయకులను టార్గెట్ గా చేసుకుని అనేక వేధింపులకు పాల్పడడం ఇవన్నీ లెక్కలు వేసుకుంటున్న కేసీఆర్ ఇప్పటి నుంచే టిక్కెట్ల విషయంలో కసరత్తు మొదలుపెట్టి, అన్ని నియోజకవర్గాల్లోనూ వాస్తవ పరిస్థితులను అంచనా వేసి, దానికనుగుణంగా టికెట్లు కేటాయింపు చేయాలని నిర్ణయించుకున్నారట.







