ఈ స్టార్ హీరోయిన్లు చేస్తున్న వ్యాపారాల గురించి తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

మనలో చాలామంది సంపాదించిన డబ్బును ఎక్కడో ఒకచోట ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంటారు.స్టార్ హీరోయిన్లు సైతం ఇదే విధంగా సినిమాలు, యాడ్స్, వెబ్ సిరీస్ ల ద్వారా సంపాదించిన డబ్బును ఇతర వ్యాపారాలలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.

 Tollywood Heroines Business Plans Samantha Kajal Nayantara Rakul Details, Tollyw-TeluguStop.com

బిజినెస్ లకు సంబంధించి ఒక్కో హీరోయిన్ ఒక్కో రూట్ ను ఫాలో అవుతుండటం గమనార్హం.

చిన్న వయస్సులోనే హీరోయిన్లు వ్యాపారాలలో కూడా సత్తా చాటుతూ ఇతర సెలబ్రిటీలను ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నారనే చెప్పాలి.

తెలుగు, హిందీ భాషల్లో సక్సెస్ అయిన ఇలియానా గోవాలో బేకరీ, రెస్టారెంట్ వ్యాపారాల ద్వారా కళ్లు చెదిరే లాభాలను అందుకుంటున్నారు.తాప్సీ మ్యారేజ్ ఈవెంట్స్ బిజినెస్ లో సత్తా చాటుతుండగా ప్రణీత రెస్టారెంట్ బిజినెస్ లో సక్సెస్ అవుతున్నారు.

సౌత్ ఇండియాలోని ప్రధాన నగరాలలో ఆమెకు బ్రాంచ్ లు ఉన్నాయి.

హీరోయిన్ రకుల్ విషయానికి వస్తే జిమ్ సెంటర్లను ఓపెన్ చేయడం ద్వారా ఈ బ్యూటీ కళ్లు చెదిరే లాభాలను అందుకుంటున్నారు.శృతి హాసన్ సైతం ప్రొడక్షన్ హౌస్, షార్ట్ ఫిల్మ్స్ నిర్మాణంలో అడుగుపెట్టారు.కీర్తి సురేష్ కు సొంతంగా స్కిన్ కేర్ బ్రాండ్ ఉండగా ఈ బ్రాండ్ చాలా పాపులర్ అయింది.

ఈ హీరోయిన్లకు ఉన్న క్రేజ్ వల్ల కూడా ఈ హీరోయిన్ల వ్యాపారాలకు ఊహించని స్థాయిలో లాభాలు వస్తున్నాయి.

హీరోయిన్ శ్రియకు స్పా కంపెనీ ఉండగా ఈ కంపెనీ లాభాల్లో ఉంది.నయనతార కూడా పలు కంపెనీలలో పెట్టుబడులు పెట్టారని వార్తలు వచ్చాయి.హీరోయిన్ సమంత సైతం సాకీ బ్రాండ్ తో బిజినెస్ చేస్తున్న సంగతి తెలిసిందే.

కాజల్ కూడా నగల వ్యాపారంలో ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube