మెగా ఫ్యామిలీ ని నమ్ముకుంటే ఎన్ని కోట్లు పోయాయో తెలుసా ?

సి కళ్యాణ్.సినిమా ఇండస్ట్రీ లో నిర్మాత గా సి కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.వివాదాలకు కళ్యాణ్ కేంద్ర బిందువు లాంటి వ్యక్తి.కెరీర్ మొత్తం మీద కేవలం ఐదు సినిమాలు మాత్రమే తీసిన సి కళ్యాణ్ సంపాదించింది మాత్రం పెద్దగా ఏమి లేదు అంటూ ఉంటాడు.

 How C Kalyan Lost All The Money , C Kalyan, Film Producer, Inttelligent , Varun-TeluguStop.com

జ్యోతి లక్ష్మి సినిమాతో ప్రొడ్యూసర్ గా మారిన సి కళ్యాణ్ ఆ తర్వాత మెగా వారి అబ్బాయి వరుణ్ తేజ్ తో పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో లోఫర్ సినిమా తీసాడు.ఈ సినిమా వల్ల దాదాపు 7 కోట్లు పోగొట్టుకున్నాడు.

అప్పటికి వరుణ్ తేజ్ కి హైయెస్ట్ రెమ్యునరేషన్ ఇచ్చి కేవలం డైరెక్టర్ మీద ఉన్న నమ్మకం తో పెట్టుబడి పెట్టాడు.కానీ ఆ సినిమా అతడికి తీరని నష్టాలని మిగిల్చింది.ఇక సి కళ్యాణ్ కొడుకు పేరు కూడా వరుణ్ కావడం తో సొంత కొడుకు కన్నా కూడా ఎక్కువగా వరుణ్ తేజ్ ని భావించి సినిమా తీస్తే అది కలిసి రాలేదు.ఇక ఆ తర్వాత బాలకృష్ణ తో కె ఎస్ రవి కుమార్ డైరెక్షన్ లో జయ సింహ సినిమా చేయగా అది కూడా పరాజయాన్ని చవి చూసింది.

ఇక లాభం లేదు అనుకోని సాయి ధరమ్ తేజ్ హీరో గా వి వి వినాయక్ డైరెక్షన్ లో ఇంటెలిజెంట్ అనే సినిమా తీసాడు.

అది కూడా తీవ్రం గా నిరాశ పరిచింది.తేజ్ ని నమ్ముకొని సినిమా తీస్తే చివరి నిముషం లో ఓవర్ సీస్ ని కూడా విడుదల చేయకుండా సాయి దారం తేజ్ ఆపాడని దాంతో మరింత నష్టాన్ని మూటగట్టుకున్నాని సి కళ్యాణ్ ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపాడు.మరోమారు బాలయ్య బాబు తో రూలర్ అనే చిత్రం తీయగా అది కూడా ఘోరంగా దెబ్బ కొట్టింది.2019 లో చివరగా రూలర్ సినిమా తీయగా ఆ తర్వాత మళ్లి సినిమాలను తీయడం లేదు.కేవలం నాలుగు ఏళ్ళ కాలం లో ఐదు సినిమాలు చేసి ఆ తర్వాత నాలుగు ఏళ్లుగా సినిమాలకు దూరం గా ఉన్నారు కానీ వివాదాలకు మాత్రం ఎప్పుడు దగ్గరగానే ఉంటారు.

ఇలా ఒక రకంగా మెగా ఫామిలీ వల్ల చాల నష్టపోయాను అని ఆ తర్వాత బాలయ్య వల్ల నష్టపోయాను అంటూ మీడియా ముందు చెప్తున్నారు సి కళ్యాణ్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube