వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచం పెను సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో భారత సంతతికి చెందిన ఆర్ధిక నిపుణులు, ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా అభ్యర్ధి అజయ్ బంగా కీలక వ్యాఖ్యలు చేశారు.వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి వీలుగా అభివృద్ధి నమూనాను మార్చాల్సిన అవసరం వుందన్నారు.
ప్రస్తుతం కెన్యా పర్యటనలో వున్న బంగా.కార్బన ఉద్గారాలతో ప్రపంచం నిండిపోతోందన్నారు.
దానిని తాము కానీ, తమ పిల్లలు కానీ భరించలేరని పేర్కొన్నారు.గ్లోబల్ వార్మింగ్‌ను ఎదుర్కోవడానికి ప్రైవేట్ రంగం కలిసి రావాలని అజయ్ బంగా విజ్ఞప్తి చేశారు.

అజయ్ బంగాను ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా తరపున నామినేట్ చేశారు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్.ఇప్పటి వరకు ఆయన అభ్యర్ధిత్వం మాత్రమే ఖరారు కాగా.మరే దేశం ఇంకా ముందుకు రాలేదు.భారత్, కెన్యా, ఘనా దేశాల మద్ధతును ఇప్పటికే అజయ్ బంగా సంపాదించారు.తన గ్లోబల్ టూర్‌లో భాగంగా ఐవరీ కోస్ట్ తర్వాత కెన్యాలో ఆయన పర్యటిస్తున్నారు.రాబోయే వారాల్లో ఆయన ఐరోపా, చైనా, భారత్, జపాన్‌లతో పాటు లాటిన్ అమెరికా, ఆసియాలోని పలు దేశాల్లో పర్యటించనున్నారు.
సాధారణంగా ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష బాధ్యతలను తొలి నుంచి అమెరికా పౌరులే నిర్వర్తిస్తుండగా.ఐఎంఎఫ్‌కు సారథిగా యూరోపియన్లు వ్యవహరిస్తూ వస్తున్నారు.
ప్రపంచ బ్యాంక్‌లో అమెరికా అతిపెద్ద వాటాదారు.ప్రస్తుత వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు డేనిస్ మాల్పాస్ ఈ ఏడాది చివరిలో తన పదవికి రాజీనామా చేయనున్న నేపథ్యంలో అజయ్ బంగా పేరును ఈ పదవికి నామినేట్ చేశారు జో బైడెన్.

కాగా.నవంబర్ 10, 1959న మహారాష్ట్రలోని పూణేలో జన్మించిన అజయ్ బంగా పూర్తి పేరు.అజయ్ పాల్ సింగ్ బంగా.ఆయన తండ్రి భారత సైన్యంలో ఉన్నత అధికారి.నిజానికి వీరి స్వగ్రామం పంజాబ్‌లోని జలంధర్.అయితే తండ్రి ఉద్యోగ రీత్యా వారి కుటుంబం తరచుగా ఇతర ప్రాంతాలకు వెళ్లేది.
అజయ్ బంగా తండ్రి హర్భజన్ సింగ్ బంగా.లెఫ్టినెంట్ జనరల్‌గా పదవీ విరమణ పొందారు.
అజయ్ బంగా విద్యాభ్యాసం సికింద్రాబాద్, జలంధర్, ఢిల్లీ, అహ్మదాబాద్, షిమ్లాలలో జరిగింది.బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ప్రైమరీ విద్యను పూర్తి చేసిన ఆయన.ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్‌సన్ కాలేజ్ నుంచి ఎకనమిక్స్‌లో హానర్స్ పట్టా పొందారు.ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో పీజీపీ, అహ్మాదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి ఎంబీఏ అందుకున్నారు.1981లో నెస్లేలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన అజయ్ బంగా.13 సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో పనిచేశారు.ఆతర్వాత పెప్సీకోలో పనిచేశారు.







