బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.అక్రమ కేసులు బనాయిస్తున్నారని బీజేపీ విమర్శలు చేస్తున్నారని తెలిపారు.
అబద్దాలు మాట్లాడటంలో కల్వకుంట్ల కుటుంబాన్ని మించిన వాళ్లు లేరని కిషన్ రెడ్డి ఆరోపించారు.బీఆర్ఎస్ నేతలు నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నారన్నారు.
కవిత చేసిన పనికి తెలంగాణ ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని వెల్లడించారు.అన్నా చెల్లె.
ఇద్దరూ అబద్దాలు మాట్లాడారని ఆరోపించారు.మహిళా రిజర్వేషన్ కోసం ధర్నా చేస్తే ఈడీ నోటీసులు వచ్చాయని కవిత చెప్పారన్న కిషన్ రెడ్డి మహిళా రిజర్వేషన్లపై మాట్లాడే అర్హత కల్వకుంట్ల కుటుంబానికి ఉందా అని అడిగారు.
మొదటి కేబినెట్ లో మహిళా మంత్రి లేకుండా పాలించిన మీకు ప్రశ్నించే అర్హత ఉందా అని ప్రశ్నించారు.







