ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో లోకల్ నుండి గ్లోబల్ వరకు భారీ సినిమాలు ఉన్నారు.బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వరుస ప్లాప్స్ అవుతున్న క్రమంలోనే ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సినిమాలపై ఫ్యాన్స్ భారీ హోప్స్ పెట్టుకున్నారు.
మరి ప్రభాస్ వరల్డ్ లెవల్లో చేస్తున్న సినిమానే ”ప్రాజెక్ట్ కే”. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
వరల్డ్ వైడ్ గా హాలీవుడ్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా తెరకెక్కుతుంది.500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్ వంటి భారీ తారాగణం ఇందులో భాగం అయ్యారు.ఈ సినిమా అప్డేట్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ లో అమితాబ్ బచ్చన్ గాయపడిన విషయం తెలిసిందే.
ఈయన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుని షూటింగ్ కు విరామం తీసుకున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవ్వనుందని ముందుగా అనుకున్న సమయానికి రిలీజ్ కాకపోవచ్చు అని నిన్నటి నుండి సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రచారం జరుగుతుంది.తాజాగా ఈ రూమర్స్ మీద క్లారిటీ తెలుస్తుంది.ఇందులో వాస్తవం అయితే లేదని.
అమితాబ్ బచ్చన్ షూట్ లో పాల్గొనక పోయిన మిగతా పార్ట్ షూట్ పూర్తి చేయనున్నారట.

అంతేకాదు విఎఫ్ఎక్స్ వర్క్ ఫాస్ట్ గా జరుగుతుండడంతో అమితాబ్ కోలుకోగానే ఆయన పార్ట్ షూట్ పూర్తి చేసి ముందుగా ప్రకటించిన విధంగానే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు యూనిట్ సభ్యులు చెబుతున్నారు.చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో.







