అరటిలో జింకుదాతువు లోపం నివారణ.. అధిక దిగుబడి కోసం నిపుణుల సూచనలు..!

అరటి పంట ఏడాది పొడవునా ఏ సీజన్లో అయినా సాగు చేయవచ్చు.మార్కెట్లో అరటికీ ఎప్పుడు డిమాండ్ ఉంటుంది.

 Prevention Of Zinc Deficiency In Banana Expert Suggestions For High Yield , High-TeluguStop.com

ప్రధానమైన ఉద్యానవన పంటలలో చాలా ముఖ్యమైనదిగా అరటి పంటను చెప్పుకోవచ్చు.అరటి పంట ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది.

భారతదేశంలో ఐదు లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో అరటిపంట సాగవుతుంది.భారతదేశంలో పండ్ల తోటల విస్తీర్ణంలో దాదాపు 18% అరటిపంటదే.

అంటే అంతర్జాతీయ స్థాయిలోనే కాదు జాతీయస్థాయిలో కూడా అరటిపంట అగ్రస్థానంలోనే ఉంది.అరటి పంటకు వానాకాలం, శీతాకాలంలో ఎటువంటి డోకా లేదు.

శ్రమ కూడా తక్కువ.పెట్టుబడి కూడా తక్కువగా ఉండి ఆశించిన స్థాయిలో ఆదాయం అర్జించవచ్చు.

వేసవికాలంలో తీవ్రమైన ఎండలు, ఇంకా నీటి ఎద్దడి సమస్యల వల్ల అరటి పంటకు తీవ్ర నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి.

ఇలాంటి సమస్యల వల్ల సూక్ష్మ పోషక లోపాలు ఎదురవుతాయి.తద్వారా జింకు ధాతువు లోపం ఏర్పడి, మొక్కలు క్షీణిస్తాయి.కాబట్టి వేసవికాలంలో జింక్ ధాతువు లోపం నివారణ కు తగిన జాగ్రత్తలు తీసుకుపోతే దీని ప్రభావం పంటపై పడి, పంట ఎదుగుదల లోపిస్తుంది.

అరటి తోటల్లో పచ్చిరొట్ల పైరు వేసి కలియ దున్నడం వల్ల జింకు దాతువు లోపాన్ని నివారించవచ్చు.జింకు దాతువు లోపం ఏర్పడితే అరటి ఆకుల సైజు చాలా తక్కువగా ఉండి, అరటి కాయ సైజు పరిమాణం కూడా తక్కువగా ఉండి నాణ్యత లోపం ఏర్పడుతుంది.

జింక్ ఫాస్ఫేట్ ను పంటపై పిచికారి చేయడం వల్ల జింకు దాతువు లోపాన్ని నివారించవచ్చు.భూమి లోపల ఉప్పు శాతం ఎక్కువగా ఉన్న, పోషక విలువలు లేని నీరు ఎక్కువగా పారించిన, భూమిలో సౌడు శాతం ఎక్కువగా ఉన్న ఈ జింక్ దాతువు లోపం ఏర్పడుతుంది.

వ్యవసాయ క్షేత్రా నిపుణుల సలహాతో తొందరగా నివారణ చర్యలు చేపడితే మెరుగైన పరిమాణం అరటి కాయలు గల నాణ్యమైన అరటి పంట దిగుబడి పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube