తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగు బుల్లితెరపై మకుటం లేని మహారాణిగా దూసుకుపోతోంది యాంకర్ సుమ.
అంతేకాకుండా ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ యాంకర్లలో నెంబర్ వన్ స్థానంలో దూసుకుపోతోంది.ఇది ఇలా ఉంటే ఇటీవలే కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమా ఈవెంట్ లో భాగంగా ఎన్టీఆర్ పాల్గొన్న విషయం తెలిసిందే.
ఆ ఈవెంట్ కి యాంకర్ సుమ హోస్ట్ గా వ్యవహరించింది.

అయితే ఆ ఈవెంట్ లో సుమ ఎన్టీఆర్ 30 వ సినిమాకు సంబంధించిన అప్డేట్ ని ఇస్తారు అని చెప్పి ఎన్టీఆర్ కు ఆమె మైక్ ఇస్తుండగా ఆ సమయంలో ఎన్టీఆర్ సీరియస్ గా సుమ వైపు చూసిన విషయం తెలిసిందే.అంతేకాకుండా వెంటనే మైక్ అందుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అడగకపోయినా నువ్వే చెప్పేలా ఉన్నావు అని కోపంగా చూసిన విషయం తెలిసిందే.అందుకు సంబంధించిన వీడియో ఆ సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు ఎన్నో రకాల వార్తలు కూడా వినిపించాయి.
కొందరు సుమ ట్రోల్స్ చేయగా మరికొందరు ఎన్టీఆర్ పై మండిపడ్డారు.కానీ సుమ పెద్దగా పట్టించుకోలేదు.

ఇది ఇలా ఉంటే చాలా గ్యాప్ తర్వాత యాంకర్ సుమ తాజాగా ఎన్టీఆర్ పేరు ఎత్తకుండా కౌంటర్ ఇచ్చినట్లు మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇటీవల వెంకటేష్, రానా నటించిన రానానాయుడు ప్రెస్ మీట్ లో పాల్గొన్న సుమ ఊహించిన విధంగా ఒక కామెంట్ చేసింది.రానా నాయుడు సినిమాలో వెంకీ కొన్ని నెగటివ్ షేడ్స్ లో కనిపించనున్నాడు.దాంతో సుమ కాస్త విలన్ తరహాలో సీరియస్ లుక్ లో చూడవలసిందిగా రిక్వెస్ట్ చేయడంతో వెంటనే వెంకటేష్ సీరియస్ గా చూశాడు.
ఈ మాత్రం చాలు ఇక రేపటికి చాలా థంబ్ నెయిల్స్ వస్తాయి.అందరూ నన్ను ఇలానే చూస్తున్నారు ఈమధ్య అంటూ ఎన్టీఆర్ పేరు చెప్పకుండానే కౌంటర్ ఇచ్చింది.







