బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో రణబీర్ కపూర్ అలియా భట్ జంట ఒకటి అని చెప్పాలి.ఇలా వీరిద్దరు కథ కొంతకాలంగా ప్రేమలో ఉంటూ గత ఏడాది ఏప్రిల్ నెలలో వివాహం చేసుకున్నారు.
ప్రస్తుతం ఈ దంపతులకు రాహ అనే కుమార్తె కూడా జన్మించారు.ఇలా కెరియర్లో ఎంతో బిజీగా గడుపుతూ వృత్తిపరమైన వ్యక్తిగత జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ఈ జంట ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రణబీర్ కపూర్ పలు ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడారు.
సాధారణంగా ప్రతి ఒక్కరికి వారి జీవితంలో కొన్ని లక్ష్యాలు ఉంటాయి.
కొందరు వాటిని సాధించే వరకు కృషి చేస్తూ ఉంటారు కానీ నా విషయంలో మాత్రం నా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నా లక్ష్యాలు మారుతూ ఉంటాయని ఈయన తెలియజేశారు.ప్రస్తుతం తనకు అల్లు అర్జున్ నటించిన పుష్పా లాంటి సినిమాలో నటించాలని ఉందని రాజమౌళితో సినిమా చేయాలని ఉందని తెలిపారు.
అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మంచి స్క్రిప్ట్లతో తన వద్దకు వస్తే కొత్తవారికి కూడా అవకాశం ఇవ్వాలన్నదే తన కోరిక అంటూ తెలిపారు.

ఇక యాంకర్ తనని ప్రశ్నిస్తూ పెళ్లి పాప పుట్టిన తర్వాత మీరు రొమాంటిక్ కామెడీలు చేస్తారా చాక్లెట్ బాయ్ అని ట్యాగ్ కంటిన్యూ చేస్తారా అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు రణబీర్ సమాధానం చెబుతూ పెళ్లికి రొమాంటిక్ చేయడానికి సంబంధం లేదు కానీ ప్రస్తుతం రొమాంటిక్ ట్రెండ్ లేదన్నది నా ఫీలింగ్ అంటూ సమాధానం చెప్పారు.స్క్రీన్ మీద హీరోయిన్లతో క్లోజ్ గా ఉంటే ఆలియా ఇష్టపడటం లేదా అనే ప్రశ్న ఎదురయింది.

ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ అలాంటి చిన్న చిన్న విషయాల గురించి అలియా ఏ మాత్రం పట్టించుకోదని సమాధానం చెప్పారు.చిన్నప్పటినుంచి మేమిద్దరం ఇదే ఫీల్డ్ లో పుట్టి పెరగాం.ఈ ఫీల్డ్ గురించి మాకు తెలియని ఏమీ లేదు అందుకే అలియా ఇలాంటి వాటిని ఏమాత్రం పట్టించుకోదని అయితే ఇవన్నీ కూడా ఎవరో పుట్టిస్తున్న వార్తలు మాత్రమే వీటిని విన్నప్పుడు ఇద్దరం నవ్వుకుంటాం అంటూ ఈయన సమాధానం చెప్పారు.







