సమంత తీరు అందరికీ స్ఫూర్తి... సమంత పై మంచు లక్ష్మి కామెంట్స్!

వెండితెర నటిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇండస్ట్రీలో సక్సెస్ సాధించడం కోసం అహర్నిశలు కష్టపడుతూ అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో ఎంతో ఎత్తుకు ఎదిగిన సమంత తన వృత్తిపరమైన జీవితంలో సంతోషంగా ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు.

 Samanthas Style Is An Inspiration To All Manchu Lakshmi Comments On Samantha, Sa-TeluguStop.com

ప్రేమించిన వ్యక్తిని పెళ్ళాడి అతనితో మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకోవడం భయంకరమైన వ్యాధులు తనని చుట్టుముట్టడం వంటి సమస్యలతో సమంత పోరాడుతూ ధైర్యంగా నిలబడ్డారు.

ఈ క్రమంలోనే నటి మంచు లక్ష్మీ సైతం సమంత ధైర్య సాహసాల గురించి సమంత పట్ల ప్రశంసలకు కురిపిస్తూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.మోహన్ బాబు వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు లక్ష్మీ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే మంచు లక్ష్మి నటించిన అగ్ని నక్షత్రం సినిమా నుంచి తెలుసా తెలుసా అనే పాటను సమంత చేతుల మీదుగా విడుదల చేశారు.

ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ కు సంబంధించినది కావడంతో మహిళా దినోత్సవం సందర్భంగా ఈ పాటను విడుదల చేశారు.

ఈ సందర్భంగా సమంతతో తనకు ఉన్నటువంటి అనుబంధం గురించి మంచు లక్ష్మి మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.సమంత వ్యక్తిత్వానికి ప్రతిరూపం.ఇండస్ట్రీలో పనిచేస్తున్న మహిళలుగా తాము ఇలాగే ఉండాలి.

సమంతతో పాటు ఆమె అనుభవించిన కష్టాలు వాటిని ఎదుర్కొన్న తీరు తనకు తెలుసు.ఇక సమంత స్థానంలో మరెవరున్నా కూడా నలిగిపోయేవారు ఎంతో క్లిష్ట పరిస్థితులలో కూడా సమంత ధైర్యం కోల్పోకుండా తనని తాను మలుచుకున్న తీరు ఎందరికో స్ఫూర్తి అంటూ సమంత గురించి మంచు లక్ష్మి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి.

ఇకవంశీకృష్ణ దర్శకత్వంలో వస్తున్నటువంటి అగ్ని నక్షత్రం సినిమాకు మంచు లక్ష్మీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఇక ఈ సినిమాలో ఈమె కూతురుతో పాటు తన తండ్రి కూడా కలిసి నటించడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube