బాహుబలి మూవీలో రాశిఖన్నా మిస్సైన రోల్ ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

బాహుబలి సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ ప్రస్తుతం స్టార్ స్టేటస్ తో ఊహించని స్థాయిలో అవకాశాలను అందుకుంటున్నారు.బాహుబలి మూవీలో నటించిన ప్రతి ఒక్కరికీ క్రేజీ ప్రాజెక్ట్ లలో ఆఫర్లు రావడంతో పాటు రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ పెరిగింది.

 Raashi Khanna Missed Tamanna Avantika Role In Baahubali Details, Raashi Khanna ,-TeluguStop.com

అయితే బాహుబలి సినిమాలో నటించే అవకాశాన్ని రాశిఖన్నా కోల్పోయారట.క్యూట్ లుక్స్ తో ప్రేక్షకులను మెప్పించిన రాశిఖన్నా రాజమౌళి హృదయాన్ని మాత్రం గెలుచుకోలేదట.

స్వయంగా రాశిఖన్నా ఒక సందర్భంలో ఈ షాకింగ్ విషయాలను పంచుకున్నారు.బాహుబలి మూవీకి అడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి నేను వచ్చానని తమన్నా పోషించిన అవంతిక రోల్ కోసం నేను అడిషన్ ఇచ్చానని ఆమె కామెంట్లు చేశారు.

అవంతిక రోల్ కు అందంతో పాటు రఫ్ లుక్ కావాలని అయితే సుకుమారమైన ముఖంతో ఉన్న నా చేతిలో కత్తి ఉండటాన్ని రాజమౌళి చూడలేకపోయారని రాశిఖన్నా పేర్కొన్నారు.

నేను లవ్ స్టోరీలలో నటిస్తే బాగుంటుందని రాజమౌళి భావించారని నా ఫ్రెండ్ ఒక లవ్ స్టోరీ చేస్తున్నాడని చెప్పి ఊహలు గుసగుసలాడే సినిమాలో నటించే అవకాశాన్ని రాజమౌళి పరోక్షంగా ఇప్పించాడని రాశిఖన్నా పేర్కొన్నారు.ఊహలు గుసగుసలాడే సినిమా సక్సెస్ తో తెలుగులో మంచి పేరు రావడంతో పాటు ఇతర భాషల్లో కూడా మంచి ఆఫర్లు వచ్చాయని రాశిఖన్నా చెప్పుకొచ్చారు.

రాజమౌళి తన డైరెక్షన్ లో రాశిఖన్నాకు అవకాశాలు ఇచ్చి ఉంటే మాత్రం ఆమె రేంజ్ మరింత పెరిగి ఉండేది.రాబోయే రోజుల్లో రాజమౌళి రాశిఖన్నా కాంబినేషన్ ను ప్రేక్షకులు చూస్తారేమో తెలియాల్సి ఉంది.రాశిఖన్నా విషయంలో రాజమౌళి వ్యవహరించిన తీరుపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

రాశిఖన్నా తర్వాత ప్రాజెక్ట్ లపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.ఆమె కెరీర్ పరంగా మరింత ఎదిగి సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube