రాజకీయ సమీకరణాలు ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పలేం.ఖచ్చితంగా పార్టీ మారతాడు అనే అంచనాలున్నా వంగవీటి రాధా నారా లోకేష్ ని పాదయాత్ర లో కలసి చర్చించడం రాష్ట్ర రాజకీయాల్లో కొంత సంచలనం కలిగించిందని చెప్పవచ్చు.
జనసేన పార్టీతో గత కొన్నాళ్లుగా మంచి సంబంధాలు నెరుపుతూ వస్తున్న రాదా మరి సడన్గా యూటర్న్ తీసుకోవడానికి గల కారణం ఏమిటో అంతుచిక్కడం లేదు.రాధాని అభిమానించే సామాజిక వర్గ అభిమానులు ఎక్కువ శాతం జనసేనలో ఉన్నందున ఆయన కచ్చితంగా జనసేనలో చేరతాడని చాలామంది అంచనా వేశారు.

మిగతా పార్టీల కంటే జనసేనలో తనకు ఎక్కువ కంఫర్ట్ ఉంటుందనే అభిప్రాయాల మధ్య ఇక చేరడం లాంచనమే అని అందరూ అనుకుంటున్న సమయంలో ఇలా ఒక్కసారిగా వెనకడుగు వేయడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది దీని వెనక టిడిపి అధిష్టానం తీసుకున్న దిద్దుబాటు చర్యలే అన్న కారణాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.గత ఎన్నికల్లో కొద్ది రోజులు ముందుగా వైసిపి నుంచి టీడీపీలో జాయిన్ అయినా రాధా కి తక్కువ సమయం ఉన్నందున ఎన్నికలకు సిద్ధంగా లేరనె కారణం తో ప్రభుత్వం రాగానే మంచి స్థానం ఇస్తామని హామీతో తెలుగుదేశం ప్రభుత్వం స్టార్ క్యాంపెనర్గా ఉపయోగించుకుంది.అయితే ఆశించినట్టుగా పార్టీ అధికారంలోకి రాకపోవడంతో ఆయన గత నాలుగు సంవత్సరాలుగా కొంత నిశ్శబ్దంగా ఉంటూ వచ్చారు.

అయితే తన తండ్రికున్న అశేష ప్రజాదరణ వల్ల పార్టీలు ఆయనపై కొంత ప్రత్యేక దృష్టి కలిగి ఉంటాయని చెప్పవచ్చు.ఈ మధ్య జనసేనకు సంబంధించిన కొన్ని కార్యక్రమాల లో ఆయన పాల్గొన్నారు.పవన్ కళ్యాణ్ కి అనుకూలం గా కూడా మాట్లాడారు .జనసేన తీర్థం పుచ్చుకుంటారని చాలామంది అంచనా వేశారు అయితే వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఎమ్మెల్యే టికెట్ తో పాటు గెలిచిన ఓడినా ఫలితంతో సంబంధం లేకుండా ప్రభుత్వంలో కీలక పదవిని హామీ ఇవ్వడం ద్వారా వంగవీటి రాధాను పార్టీ మార్పుపై ముందుకు వెళ్లకుండా అడ్డుకోగలిగారని ఇది టిడిపికి ఒక రకమైన విజయమని అని అదేవిధంగా ఒక ప్రభావ వంతమైన నేతను పార్టీలోకి తీసుకు రాగలిగే అవకాశాన్ని కోల్పోయిన జనసేనకు ఇది ఒకరకంగా ఎదురు దెబ్బ అని విశ్లేషకులు భావిస్తున్నారు .







