ఇక్కడ చెప్పుకోబోయేది నేడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నెక్స్ట్ లెవల్ వైరల్ వీడియో అని చెప్పుకోవచ్చు.అవును, ఈమధ్య కాలంలో ఎక్కువగా పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలు మన నెటిజన్లు ఎక్కువగా చూస్తున్నారు.
ఇక జంతువుల్లో అత్యంత తెలివైనవి కుక్కలు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎందుకంటే ఇవి మనుషులతో చాలా ప్రత్యేకమైన బంధాన్ని కలిగి ఉంటాయి.
అయితే కొన్నిసార్లు అవి చేసే అల్లరి చూడముచ్చటగా ఉంటుంది.ఈ క్రమంలో కుక్కలు చూపే ప్రేమ, అవి చేసే అల్లరి, డ్రామా అంతా అదుర్స్ అనిపిస్తుంటుంది.
ఈ క్రమంలోనే తాజాగా ఓ శునకం ఏ రేంజ్ లో నటించిందంటే దాని నటనకి భాస్కర్ అవార్డ్ ఇచ్చినా తప్పులేదు అని చెప్పక తప్పదు.కావాలంటే ఇక్కడ వున్న వీడియోని ఒకసారి తిలకించండి.
వైరల్ అవుతున్న వీడియోని ఒకసారి గమనిస్తే… ఒక పెంపుడు కుక్కకి ఒక కారు బొమ్మ తగులుతుంది.ఎక్కడంటే దాని కాలికి తగులుతుంది.
అంతే ఇక… ఏదో రోడ్డుపైన కార్ ప్రమాదం జరిగినట్టు, దాన్ని కాలు ఇరిగిపోయినట్టు కటింగ్ ఇస్తుంది.అక్కడితో ఆగకుండా మూర్ఛపోయి పడిపోయినట్టు బిల్డప్ ఇస్తుంది.
జస్ట్ 10 సెకెన్లు నిడివి గల ఈ వీడియో ఇపుడు నెటిజనుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది.ఇందులో కుక్క అచ్చం మనిషి మాదిరిగానే ప్రవర్తించడం ఇపుడు అందరిని కట్టి పడేస్తుంది.బులిటెన్ జెబిఎడెన్ (buitengebieden) అనే ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేయబడ్డ ఈ వీడియో ఇపుడు ఇంటర్ నెట్ ని కుదిపేస్తోంది.జనాలు అధిక సంఖ్యలో కామెంట్లు చేస్తున్నారు.“అమ్మబాబోయ్.ఇది మామూలు కుక్క కాదండోయ్!” అని కొందరంటే….“దీని నటనకి అర్జంటుగా భాస్కర్ అవార్డు ఇవ్వాల్సిందే!” అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.