అక్రమ వలసదారులపై కొత్త అణిచివేత.. యూకే హోమ్ మినిస్టర్ కొత్త బిల్లు!

అక్రమ వలసలకు చెక్ పెట్టేందుకు యూకే హోం సెక్రటరీ సుయెల్లా బ్రవర్‌మాన్ కొత్త బిల్లును ప్రకటించారు.భారత సంతతికి చెందిన సుయెల్లా మాట్లాడుతూ కొత్త చట్టం ప్రకారం, చిన్న పడవలపై అక్రమంగా యూకేకి చేరుకునే వలసదారులను తొలగిస్తామన్నారు.

 New Crackdown On Illegal Immigrants Uk Home Minister's New Bill, Indian-origin,-TeluguStop.com

ఈ బిల్లు చివరి నిమిషంలో న్యాయ సమీక్షలను కూడా నిషేధిస్తుందని వివరించారు.ప్రస్తుతం అప్పీల్‌కు అవకాశం లేకుండా న్యాయ సమీక్షలు అర్థరాత్రి జరుగుతున్నాయి.

కాగా ఇకపై జ్యూడిషల్ రివ్యూస్ ఉండవు.ఇక కొత్త చట్టం ఆశ్రయం పొందే హక్కుపై చట్టవిరుద్ధంగా యూకేలోకి ప్రవేశించే వారిని తొలగించే హోం సెక్రటరీ విధికి ప్రాధాన్యతనిస్తుంది.

అయితే కొత్త చట్టం నుంచి 18 ఏళ్లలోపు వారికి, సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్న వారికి, తీవ్ర ప్రమాదంలో ఉన్న కొంతమంది వ్యక్తులకు మినహాయింపులు ఉంటాయి.చట్టవిరుద్ధంగా వచ్చిన వారిని బెయిల్ లేకుండా నిర్బంధించడం లేదా నిర్బంధంలో ఉన్న మొదటి 28 రోజులలోపు వారిని తొలగించే వరకు న్యాయ సమీక్ష కూడా బిల్లు అనుమతిస్తుంది.

సురక్షిత మార్గాల ద్వారా యూకేలో ఆశ్రయం పొందిన వలసదారులపై వార్షిక పార్లమెంట్-సెట్ పరిమితి కోసం ప్రణాళికలు కూడా ఉన్నాయి.కొత్త చట్టం పట్ల శరణార్థుల స్వచ్ఛంద సంస్థలు, మానవ హక్కుల సంఘాలు శరణార్థులకు చట్టపరమైన చిక్కుల ఎదురవుతాయేమోనని ఆందోళన వ్యక్తం చేశాయి.ఇక ప్రతిపక్ష లేబర్ పార్టీ, లిబరల్ డెమోక్రాట్లు కూడా బిల్లు సాధ్యత, చట్టబద్ధతపై సందేహాలు వ్యక్తం చేశాయి.మరి యూకే ప్రభుత్వం ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఈ కొత్త బిల్లును చట్టం ఎలా ప్రవేశ పెడుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube