టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ (EV)ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు.ఇది ప్రస్తుత మోడళ్ల కంటే చాలా తక్కువ ధరతో అందుబాటులో ఉంటుంది.
విభిన్న రకాల కార్లు అందించడం ద్వారా ఈవీ మార్కెట్‌లో కంపెనీ తన పరిధిని విస్తరించాలని ప్రణాళికలు రచిస్తోంది.అందులో భాగంగానే చవకైన ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకురావాలని మస్క్ ప్లాన్ చేశారు.
ప్రస్తుత అత్యంత సరసమైన టెస్లా మోడల్ 3 కంటే కొత్త ఈవీ తయారీ చౌకగా ఉంటుందని మస్క్ పంచుకున్నారు.ఈ కారు ఎక్కువగా అటానమస్ మోడ్‌లో పనిచేస్తుంది.
అయితే దీని విడుదల తేదీపై ఇంకా ఎలాంటి వార్తలు బయటికి రాలేదు.
కొత్త మార్కెట్‌లలోకి ప్రవేశించడానికి, 2030 నాటికి ఏటా 2 కోట్ల ఈవీలను ఉత్పత్తి చేయాలనే దాని లక్ష్యాన్ని సాధించడానికి టెస్లా ఇప్పటి నుంచే సిద్ధం కావడం ముఖ్యం.ఇందులో భాగంగా టెస్లా కంపెనీ కొత్త ప్రోడక్ట్ ఫెసిలిటీలను అన్వేషిస్తోంది.ప్రపంచంలోనే అతిపెద్ద EV ఫ్యాక్టరీ నిర్మాణం కోసం మెక్సికన్ అధికారులతో చర్చలు జరుపుతోంది.టెస్లా చౌకైన ఈవీని దాదాపు 25 వేల డాలర్లు (సుమారు రూ.20.52 లక్షలు) ధరతో అందించే అవకాశం ఉందని మస్క్ అభిప్రాయపడ్డారు.ఇది ప్రస్తుత చౌకైన మోడల్ “మోడల్ 3” ధర (43 వేల డాలర్లు) కంటే చాలా తక్కువ.
మరోవైపు మరింత మంది కొనుగోలుదారులను ఆకర్షించడానికి, టెస్లా ఇప్పటికే యూఎస్, చైనా వంటి వివిధ మార్కెట్లలో ధరలపై డిస్కౌంట్స్ ప్రకటించింది.ఇతర ఈవీ పోటీదారులు కూడా భారీగా ఈవీల ధరలు తగ్గించారు.అయినప్పటికీ, కొత్త మార్కెట్లలో ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఎక్కువ సేల్స్ కావాలంటే కంపెనీ చీప్ ప్రైసెస్ మెయింటైన్ చేయాలి.ఇక కొత్తగా తీసుకొచ్చే చౌకైన స్మాల్ EV గేమ్-ఛేంజర్ కావచ్చు.
అలానే టెస్లా మార్కెట్ మరింత పెరగొచ్చు.