గ్లాసు కూల్ డ్రింక్స్ లో ఎంత చక్కెర ఉంటుంది.. శరీరంపై దీని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా..!

సాధారణంగా ఎండాకాలం వచ్చిందంటే చల్లని ఆహార పదార్థాలు ఉపయోగం పెరుగుతుంది.వీటిలో శీతల పానీయాల వినియోగం మరింత పెరుగుతుందని కచ్చితంగా చెప్పవచ్చు.

 How Much Sugar Contains In Cool Drinks What Are Its Side Effects Details, Sugar-TeluguStop.com

శీతల పానీయల రుచి అందరికి ఎంతో నచ్చుతుంది.శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం శీతల పానీయాలు ఆరోగ్యపరంగా అసలు మంచివి కావు.

శీతల పానీయాలు తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర శాతం పెరుగుతుంది.దీని ప్రభావం ఆరోగ్యం పై ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

శీతల పానీయాలను అధికంగా తీసుకోవడం వల్ల వేగంగా బరువు పెరుగుతారు.శీతల పానీయాలలో చక్కెర అధికంగా ఉంటుంది.అంతేకాకుండా అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదురవుతాయి ఒక గ్లాసు శీతల పానీయాలలో ఎనిమిది నుంచి పది టీస్పూన్ల చక్కెర ఉంటుంది.చల్లని పానీయాలు తాగడం వల్ల ఆహారంలో అధిక చక్కెర తీసుకున్నట్లు అవుతుంది.

ఇది ఆరోగ్యానికి ఏ విధంగానూ మంచిది కాదు.ఒక గ్లాసు శీతల పానీయాల లో దాదాపు 150 కేలరీలు ఉంటాయి.

ప్రతి రోజు ఇలా కేలరీలు తీసుకోవడం వల్ల త్వరగా బరువు పెరిగే అవకాశం ఉంది.దీని వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.శీతల పానీయాలను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.శీతల పానీయాలలో రెండు రకాల చక్కెరలు ఉంటాయి.మొదటిది గ్లూకోస్. ఇది శరీరంలోకి త్వరగా కలిసిపోతుంది.రెండోది ప్రక్టోజ్ ఇది కాలేయంలో నిల్వ అవుతుంది.

ప్రతి రోజు శీతల పానీయాలు తాగడం వల్ల ఇది కాలేయంలో అధికంగా పెరిగిపోయి కాలేయ సంబంధిత సమస్యలు వస్తాయి.ఇంకా చెప్పాలంటే శీతల పానీయాలలో చక్కర పరిమాణం చాలా అధికంగా ఉంటుంది.కాబట్టి దాని వినియోగం మధుమేహం సమస్యలను కూడా పెంచే అవకాశం ఉంది.

శీతల పానీయాలలో ఎక్కువగా తీసుకోవడం వల్ల దంత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.కాబట్టి ఎండాకాలంలో శీతల పానీయాలను తీసుకోకపోవడమే మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube