ఇటీవలే కాలంలో మొబైల్ ఫోన్ లేకపోతే ఎక్కడి పనులు అక్కడే స్తంభించిపోతున్నాయి.ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయే వరకు మనిషి వెంట మొబైల్ ఫోన్ కచ్చితంగా ఉండాల్సిందే.
మొబైల్ లేకపోతే రోజు గడవడం చాలా కష్టం.ఇక మొబైల్, ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగింది.
కాబట్టి ప్రతిక్షణం మొబైల్ ఫోన్ చేతిలో ఉండాల్సిందే.ఒక్కో సందర్భంలో మొబైల్ చేజారి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయే అవకాశాలు చాలానే ఉన్నాయి.
వేల రూపాయలు పెట్టి కొన్న ఫోన్ నీటిలో పడితే తొందరపాటుతో చేసే పనుల వల్ల ఫోన్ ఎప్పటికీ పనికి రాకుండా అయిపోతుంది.ఇప్పుడు మొబైల్ ఫోన్ నీటిలో పడినప్పుడు ఏం చేయకూడదో చూద్దాం.

మొబైల్ ఫోన్ నీటిలోంచి తీసి వెంటనే స్విచ్ ఆఫ్ చేయాలి.మొబైల్ ఫోన్ ను ఆరబెట్టే ప్రయత్నాలు చేయకూడదు.అంటే బియ్యంలో పెట్టడం, వేడి ప్రదేశాలలో పెట్టడం లాంటి పనులు చేయకూడదు.ముఖ్యంగా రెండు రోజుల వరకు ఫోన్ చార్జింగ్ పెట్టకూడదు.ఒకవేళ చార్జింగ్ పెడితే మొబైల్ లోపల తేమ వల్ల షాక్ సర్క్యూట్ జరిగే అవకాశం ఉంది.ఇక బియ్యంలో అస్సలు పెట్టకూడదు.
ఎందుకంటే డివైస్ లోపల ఉండే తేమను బియ్యపు గింజలు గ్రహించలేవు.

ఇంకా ఫోన్ పోర్ట్ లలో బియ్యపు గింజలు ఇరుక్కునే అవకాశం ఉంటుంది.ఏ బటన్స్ అంటే ఆ బటన్స్ ప్రెస్ చేయకూడదు.ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెడితే డివైస్ ఫంక్షన్స్ దెబ్బ తినే అవకాశం ఉండదు.
ఇక ఫోన్ తడిసిందని వేడి ప్రదేశాలలో పెడితే లోపల తేమ ఆరిపోతుంది అనుకుంటే అది పొరపాటే.వీటివల్ల ఎటువంటి ఫలితం ఉండదు.మొబైల్ ఫోన్ ను షేక్ చేయకూడదు. మొబైల్ ను తెరిచే ప్రయత్నం చేయకూడదు.
దీనివల్ల సురక్షితంగా ఉండే పరికరాలకు కూడా హాని జరిగే అవకాశం ఉంది.
రెండు రోజులపాటు స్మార్ట్ ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయాలి.
తరువాత దానిని సర్వీసింగ్ సెంటర్ కు తీసుకువెళితే స్మార్ట్ ఫోన్ త్వరగా బాగు చేయించుకునే అవకాశం ఉంటుంది.