మామూలుగానే అలవాట్లు లేకుండా ఈ రోజుల్లో ఎవరు ఉంటారు చెప్పండి.ఇక మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ అంటే చెప్పాల్సిన అవసరం లేదు.
మందు, విందు అనేది వారికి చాల కామన్ విషయం.వారాంతం వస్తే చాలు పబ్బుల్లో మునిగిపోతూ ఉంటారు యువత.
స్టార్స్ అయితే వారి ప్రయివేట్ ప్లేసుల్లోనే లో వీకెండ్ పార్టీస్ పెట్టుకుంటారు.అయితే ఇదంతా ప్రజెంట్ నడుస్తున్న ట్రెండ్.
కానీ బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో కూడా ఇలా వీకెండ్ పార్టీస్ యమజోరుగా నడిచాయి.ఇప్పటిలా షూటింగ్ అంటే ఫారెన్ లొకేషన్స్, అవుట్ డోర్ షూటింగ్స్ ఉండేవి కాదు.
అప్పుడు షూటింగ్ అంటే కేవలం స్టూడియో లోనే జరిగేవి లేదంటే పల్లెటూర్లో చిత్రీకరించేవారు.అందుకే సాయంకాలం ఆరు అయ్యిందంటే షూటింగ్ కి కట్ చెప్పేసి క్లబ్స్ లో కాలక్షేపం చేసేవారట.అప్పట్లో ఫారెన్ లిక్కర్ బ్రాండ్స్ అంటే యమ జోరుగా లాగించేవారట.అదొక ట్రెండ్ గా కొత్తగా ఉండేవి అప్పటి స్టార్స్ కి.ఎవరైనా నటుడు ఫారెన్ బ్రాండ్ ఏదైనా తాగితే అందరు నోరెళ్లబెట్టే వారట.నాటి రోజుల్లో సినిమా వారంతా గ్యాంగులగా క్లబ్బులో టేబుల్ షేర్ చేసుకునేవారట.
మరి ముఖ్యంగా రాజనాల, శ్రీశ్రీ, రంగారావు, రాజబాబు వంటి నటులంతా ఒకే చోట చేరి మద్యం పుచ్చుకునే వారట.
ఇందులో రాజనాల ఎక్కువ లోకల్ బ్రాండ్ కి ప్రాముఖ్యత ఇస్తే శ్రీశ్రీ, రాజబాబు, రంగారావు మాత్రం ఫారెన్ సరుకు అంటే చెవి కోసుకునేవారు.ఇక ఇక్కడ ఫారెన్ ముందుకు రేటు ఎక్కువ కాబట్టి విదేశాల నుంచి తన స్నేహితుల ద్వారా ఫోన్ చేసి మరి తెప్పించుకునే వారట.మూడు నాలుగు బాటిల్స్ పట్టుకొని షూటింగ్ కి వెళ్ళిపోయి సాయంత్రం కాగానే బ్యాచ్ అంత కలిసి క్లబ్ కి వెళ్లిపోయేవారట.
దాంతో రంగారావు అంటే ఫారెన్ బ్రాండ్ అనే పేరు పాతుకుపోయింది.ఇలా చాల మంది నటులు రంగారావు గారితో కలిసి తాగిన ఎన్టీఆర్, అక్కినేని వంటి వారు మాత్రం అటు వైపు తొంగి కూడా చూసేవారు కాదట.
అందుకే వారి పది కాలాల పాటు ఆరోగ్యం కాపాడుకొని సినిమాలు చేసుకొని అగ్రకథానాయకులుగా మిగిలిపోయారు.