యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా కొరటాల శివ దర్శకత్వం లో రూపొందబోతున్న సినిమా యొక్క అధికారిక ప్రకటన ఇప్పటికే విడుదలైన విషయం తెలిసిందే.ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు.
ఇక హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటించబోతున్నట్లు కూడా అధికారికంగా వెల్లడి అయ్యింది.అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెలుగు లో ఎప్పుడో ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది.
కానీ హిందీ లో వరుసగా వచ్చిన అవకాశాల కారణం గా ఆమె తెలుగు సినిమాలను పక్కకు పెట్టింది.ఎట్టకేలకు శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెలుగు లో ఎన్టీఆర్ సినిమా ఎన్టీఆర్30 ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
శ్రీదేవి కి ఉన్న స్టార్ ఇమేజ్ కారణంగా కచ్చితంగా జాన్వీ కపూర్ కి తెలుగు లో మంచి అవకాశాలు రావడం ఖాయం, అలాగే స్టార్ హీరోయిన్ గా కూడా వెలుగు వెలగడం ఖాయం అనే అభిప్రాయంను సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.జాన్వీ కపూర్ కాస్త సీరియస్ గా ప్రయత్నిస్తే తెలుగు లో స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్ళగలిగే స్టామినా మరియు బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోయిన్ అంటూ సినీ విశ్లేషకులు అంటున్నారు.బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో జాన్వీ కపూర్ అడుగు పెట్టడానికి కారణం కరణ్ జోహార్ అనే విషయం తెలిసిందే.
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కొరటాల శివ మరియు ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా తో అడుగు పెట్టబోతుంది.కనుక ఖచ్చితంగా ఎన్టీఆర్ 30వ సినిమా చరిత్ర లో నిలిచి పోయే అవకాశం ఉందని మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది.బాలీవుడ్ తో సన్నిహిత సంబంధాలు ఉన్న జాన్వీ కపూర్ అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ తెలుగు లో కూడా సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఎన్టీఆర్ తో చేస్తున్న మొదటి సినిమా సక్సెస్ అయితే ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ కి వరుసగా తెలుగు సినిమాల్లో నటించే అవకాశాలు పుష్కలంగా వస్తాయి.మరి జాన్వీ కపూర్ తన కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకుంటుందో చూడాలి.