మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత భారీ లైనప్ ను సెట్ చేసుకుంటున్నాడు.మరి ప్రెజెంట్ రామ్ చరణ్ మరో అగ్ర డైరెక్టర్ శంకర్ తో చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రకటించాడు.
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ‘RC15‘.ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.
పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
అయితే ఈ సినిమా షూట్ ప్రెజెంట్ కొద్దిగా బ్రేక్ ఇచ్చారు.
ఎందుకంటే ఆస్కార్ ఈవెంట్ కోసం చరణ్ యూఎస్ వెళ్లడంతో ప్రస్తుతం షూట్ బ్రేక్ లో ఉంది.అయితే ఇప్పుడు చరణ్ పై ఒక ఇంట్రెస్టింగ్ బజ్ వైరల్ అవుతుంది.
ప్రెజెంట్ బాలీవుడ్ లో ఆడియెన్స్ అంతా ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాల్లో కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ”కిసీ కా భాయ్ కిసీ కా జాన్”.
ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమాపై ఇప్పటికే బాలీవుడ్ లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక తాజాగా వైరల్ అవుతున్న ఇంట్రెస్టింగ్ న్యూస్ తో మరోసారి ఈ సినిమా హాట్ టాపిక్ అవుతుంది.
ఈ సినిమాలో వెంకీ మామ వెంకటేష్ కూడా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.ఈయన పూజా హెగ్డే అన్న రోల్ లో కనిపించ బోతున్నట్టు తెలుస్తుంది.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా క్యామియో రోల్ చేయబోతున్నాడు అని తాజాగా వార్తలు వైరల్ అవుతున్నాయి.సల్మాన్ ఖాన్ కి చిరు ఫ్యామిలీకి మధ్య సన్నిహిత సంబంధాలు ఎప్పటి నుండో ఉన్న విషయం విదితమే.మరి ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ సినిమాలో చరణ్ కనిపించేందుకు ఓకే చెప్పారట.

అయితే ఈ సినిమాలో చరణ్ స్టోరీలో కాకుండా కేవలం సాంగ్ లో మాత్రమే కనిపించనున్నారట.ఈ సాంగ్ కొరియోగ్రాఫర్ కూడా చరణ్ ను ఆరాధించే జానీ మాస్టర్ కావడం విశేషం.మరి ఈ సాలిడ్ కాంబో ఎలా ఉంటుందో వేచి చూడాలి.
ఇది నిజమైతే సిల్వర్ స్క్రీన్ మీద పూనకాలు రావడం ఖాయం.







