గత రెండు రోజులుగా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.ఈయన చేసిన వ్యాఖ్యలు గాను సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ కు గురి అవుతున్నారు.
ఇంతకీ డైరెక్టర్ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు చాలా మందికి తెలిసే ఉంటుంది.కేజిఎఫ్ సినిమాపై ఈ డైరెక్టర్ నోరు జారీ సంచనల వ్యాఖ్యలు చేసాడు.
డైరెక్టర్ వెంకటేష్ మహా తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో కెజిఎఫ్ సినిమాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసాడు.ఇది ఒక సినిమానేనా.దీనిని మనం చూడడం ఏంటో.వాడొక నీచ్ కమీన్ కుత్తే అంటూ వల్గర్ గా కామెంట్స్ అయితే చేసాడు.
ఈ కామెంట్స్ తో విమర్శలు పాలు అవుతున్నాడు.అంతేకాదు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈయనను ట్రోల్ చేస్తున్నారు.
వెంకటేష్ మహా వ్యాఖ్యలు చేసేప్పుడు అతని వ్యాఖ్యలను సమర్థిస్తూ.పక్కన కూర్చుని నవ్వినా అతని సహచర దర్శకులపై నెటిజెన్స్ తీవ్రంగా విరుచుకు పడుతున్నారు.నిన్న డైరెక్టర్ల రౌండ్ టేబుల్ సమావేశంలో భాగమైన వివేక్ ఆత్రేయ, నందిని రెడ్డి అందరి మనోభావాలను దెబ్బ తీసినందుకు సినీ ప్రేమికులకు క్షమాణపణలు తెలిపారు.
ఇక తాజాగా వెంకటేష్ ఒక వీడియో రిలీజ్ చేస్తూ తన భాషకు క్షమాపణలు చెప్పాడు.అయితే తన అభిప్రాయాన్ని అయితే వెనక్కి తీసుకోనని చెప్పారు.ఇక ఉదయం మరోసారి ఈయన ట్వీట్ చేస్తూ ఆ ప్యానెల్ లో చాలా చర్చలు జరిగాయని.
నెటిజెన్స్ చూస్తున్న 2 నిముషాల క్లిప్ ఒక సందర్భం నుండి బయటకు వచ్చిందన్నారు.తన తోటి దర్శకనిర్మాతలు ట్రోల్స్ అవుతున్నందుకు బాధగా ఉందని.నా అభిప్రాయాన్ని కొట్టేయాలని నేను కోరుకోను కానీ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో గౌరవనీయమైన డైరెక్టర్లను రక్షించ వలసిందిగా కోరుతున్నాను అంటూ ఆయన తెలిపాడు.