ఆడ బిడ్డల పై అఘాయిత్యాలను అరికట్టాలేని చేతకాని సీఎం కేసీఆర్ - బండి సంజయ్

తెలంగాణ రాష్ట్రం లో ఆడపిల్లలకు రక్షణ కరువైందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ,ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు.మహిళలు ,విద్యార్థినులు పై వరుసగా దారుణ ఘటనలు జరుగుతున్నా సరైన రీతిలో స్పందించి కఠిన నిర్ణయాలు తీసుకోకుండా సీఎం వ్యవహరించడం దారుణమైన విషయం అన్నారు.

 Cm Kcr Bandi Sanjay Is Powerless To Stop Atrocities On Girls ,bandi Sanjay,kcr-TeluguStop.com

రాష్టం లో శాంతి భద్రతలు కాపాడటం లో ప్రభుత్వం తీవ్రం గా విఫలమైందని ధ్వజమెత్తారు.రాష్టం లో వరుసగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా సోమవారం నాడు హైదరాబాద్ లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయం లో ఆయన నిరసన దీక్ష చేపట్టారు.

Telugu Bandi Sanjay, Cmkcr, Preethi, Telangana-Telugu Political News

ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రం లో జరిగిన పీజీ విద్యార్థిని ప్రీతి ఘటనలో ప్రభుత్వం నేరస్తులను శిక్షించకుండా వారికి కొమ్ము కాస్తుందని ,ప్రభుత్వమే ఈ కేసును నీరు గారుస్తుందని ఆరోపించారు.అంతే కాకుండా ఇది ఆత్మహత్య కాదని , హత్యేనని ఆరోపించారు.ర్యాగింగ్ పై ప్రీతి కుటుంబ సభ్యులు కాలేజీ లోనూ, పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదన్నారు….బీజేపీ ఇలా అన్యాయానికి గురైన ప్రతి ఒక్కరికీ అండగా ఉండటమే కాక తాము అధికారం లోకి వస్తే ఇటువంటి ఘటనలు జరగకుండా కఠిన చట్టాలు చేసి వాటిని అమలయ్యేలా చేస్తామన్నారు.

Telugu Bandi Sanjay, Cmkcr, Preethi, Telangana-Telugu Political News

ప్రభుత్వానికి కమిషన్ల మీద ,అక్రమ రాబడుల మీద ఉన్న శ్రద్ధ రాష్ట్రం లోనీ ప్రజల శ్రేయస్సు మీద ,ఆడ బిడ్డల రక్షణ మీద లేదని విమర్శించారు.ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగేవరకు తాము పోరాడుతూనే ఉంటామని ,ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఇలాంటి అన్యాయాలకు గురైన ఆడబిడ్డలకు న్యాయం జరిగేవరకు బీజేపీ పోరాటం చేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమం లో బండి సంజయ్ తో పాటు ఇతర బీజేపీ నాయకులైన కే.లక్ష్మణ్, డీకే అరుణ,ఈటెల రాజేందర్ ,పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.మరి బండి సంజయ్ వాఖ్యలపై బారసా శ్రేణుల ప్రతిస్పందన ఏమిటో చూడాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube