టాలీవుడ్ హిరోయిన్ ఫరియా అబ్దుల్లా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమున్న నటి.అనుదీప్ కె.
వి దర్శకత్వంలో తెరకెక్కిన జాతిరత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.ఇక ఈ సినిమా థియేటర్లలో విడుదలై సెన్సేషనల్ క్రియేట్ చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఫరియా ఈ సినిమాలో తొలిసారి నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.
ఇక ఈ సినిమా తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది.
నాగార్జున నటించిన బంగార్రాజు సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ లో చేసి తన స్టెప్పులతో కుర్రాళ్లను ఫిదా చేసింది.ప్రస్తుతం పలు ప్రాజెక్టులలో బిజీగా ఉంది.
ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ.తనకు సంబంధించిన ఫోటోలను, వ్యక్తిగత విషయాలను బాగా పంచుకుంటుంది.

సోషల్ మీడియాలో కూడా ఈ ముద్దుగుమ్మకు బాగా ఫాలోయింగ్ ఉంది.అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో బాగా ముచ్చట్లు పెడుతుంది.బాగా డాన్సులు చేస్తూ వాటిని కూడా పంచుకుంటూ ఉంటుంది.ఇక ఈమెను తన అభిమానులు ముద్దుగా చిట్టి అని లేదా పొడుగు కాళ్ల సుందరి అని పిలుస్తుంటారు.
ఇక ఈమె హైట్ విషయంలో బాగా ట్రోల్స్ కూడా ఎదురుకుంది.ఇక ఫోటో షూట్ లంటూ బాగా రచ్చ చేస్తుంది.
ప్రాజెక్టులతో పాటు పలు వేడుకల్లో కూడా బాగా బిజీగా ఉంటుంది.పైగా షాప్ ఓపెనింగ్స్ లలో కూడా ఈ ముద్దుగుమ్మను బాగా ఆహ్వానిస్తూ ఉంటారు.
అలా అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఫరియా అబ్దుల్లా.

ఈ బ్యూటీ కూడా ఈమధ్య పొట్టి పొట్టి బట్టలు వేస్తూ గ్లామర్ షో చేస్తుంది.అయితే చాలా వరకు ఈమె పొట్టి బట్టలు వేసుకోవడంతో నెగిటివ్ కామెంట్లు చేస్తూ ఉంటారు.ముఖ్యంగా తమ వర్గానికి చెందిన వాళ్ళు బాగా ఫైర్ అవుతూ ఉంటారు.
కానీ అవేవీ పట్టించుకోకుండా ఈ ముద్దుగుమ్మ తనకు నచ్చినట్లు ప్రవర్తిస్తుంది.తన కెరీర్ కోసం అవేవీ పట్టించుకోకుండా అందరికీ నచ్చే విధంగా తయారవుతుంది.
ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఒక డాన్స్ వీడియో పంచుకుంది.అందులో తన స్టెప్పులతో బాగా ఆకట్టుకుంది.అంతేకాకుండా తన ఎక్స్ప్రెషన్స్ తో బాగా ఫిదా చేసింది.అయితే తను వేసుకున్న డ్రెస్ కాస్త అందాలను బయటపెట్టే విధంగా ఉండటంతో తమ వర్గానికి చెందిన వాళ్లు ఫైర్ అవుతున్నారు.

ఒక ముస్లిం అమ్మాయి వైపు ఉండి ఇటువంటి బట్టలు వేసుకోవటం సరైనదేనా అంటూ పరువు తీసేస్తున్నావు కదా అంటూ మండిపడుతున్నారు.ఇక మరి కొంతమంది తన డాన్స్ స్టెప్పుల గురించి పాజిటివ్ గా కామెంట్లు పెడుతున్నారు.కొందరైతే తన హైట్ గురించి సరదాగా జోక్స్ చేస్తున్నారు.ప్రస్తుతం ఆ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తుంది.







