పశ్చిమ బెంగాల్లో అడెనో వైరస్ తీవ్ర కల్లోలం సృష్టిస్తోంది.చిన్నారులు వైరస్ బారిన పడుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఈ మేరకు పిల్లలందరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని కీలక ఆదేశాలు జారీ చేసింది.చిన్నారులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని ప్రభుత్వం తెలిపింది.
పిల్లల్లో దగ్గు, జలుబుతో పాటు జ్వరం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వారిని ఆస్పత్రిలో చేర్పించాలని వెల్లడించింది సర్కార్.అయితే ఇప్పటివరకు వైరస్ బారినపడి సుమారు 19 మంది చిన్నారులు మృతిచెందిన విషయం తెలిసిందే.







