రంగారెడ్డి జిల్లా జన్వాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది.పెట్రోల్ బంక్ సిబ్బందిపై ముగ్గురు యువకులు దాడికి పాల్పడ్డారు.
ఈ దాడిలో ఒకరు మృతిచెందగా.మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి.
ముందుగా కారులో బంక్ కు వచ్చిన యువకులు పెట్రోల్ పోయించుకున్నారు.ఈ క్రమంలో కార్డు పని చేయకపోవడంతో క్యాష్ అడిగారు బంక్ సిబ్బంది.
క్యాష్ లేదన్న యువకులు పెట్రోల్ బంక్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నిందితులు జన్వాడకు చెందిన నరేందర్, మల్లేశ్, అనూప్ గా గుర్తించారు.వీరి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు పోలీసులు.







