ఏ హీరో అయినా సక్సెస్ పడ్డ వెంటనే వరుసగా మూడు నాలుగు సినిమాలు కమిట్ అయి స్పీడ్ గా ఆ సినిమాలు పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి ఆ హిట్ సినిమాకి సంబంధించిన క్రేజ్ కంటిన్యూ అయ్యేలా.సక్సెస్ పబ్లిసిటీ ఉపయోగ పడేవిధంగా ప్లాన్ చేసుకుంటారు.
కానీ హీరో నవీన్ పోలిశెట్టి మాత్రం ఆ విధంగా ప్లాన్ చేసుకోవడంలో విఫలం అయ్యాడు అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.జాతి రత్నాలు సినిమా రెండు సంవత్సరాలు అవుతుంది వచ్చి.
ఆ సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో వెంటనే నవీన్ పోలిశెట్టి నుండి సినిమాలు వచ్చి ఉంటే కచ్చితంగా భారీ విజయాలను సొంతం చేసుకోవడం ఖాయం అనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.కానీ రెండు సంవత్సరాల పూర్తి కావస్తున్నా ఇప్పటి వరకు నవీన్ పోలిశెట్టి నుండి ఒక్క సినిమా కూడా రాలేదు.
ఈ రెండేళ్ల గ్యాప్ ని వరుసగా మూడు సినిమాలతో ఫీల్ చేసేందుకు నవీన్ పోలిశెట్టి ప్లాన్ చేస్తున్నాడని ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.
ఇప్పటికే రెండు సినిమాలను చేసిన నవీన్ పోలిశెట్టి ఒక సినిమా తో సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
మరో సినిమాతో దసరా సమయంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.ఈ సమయంలోనే మూడవ సినిమా కు నవీన్ పోలిశెట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.స్వాతిముత్యం సినిమా తో బెల్లంకొండ సాయి గణేష్ ని హీరోగా చూపించిన దర్శకుడు తో నవీన్ పోలిశెట్టి కొత్త సినిమా చేయబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.
అందుకు సంబంధించిన చర్చలు పూర్తయ్యాయని, స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని త్వరలోనే షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం అవ్వబోతున్నాయని తెలుస్తోంది.అన్ని అనుకున్నట్లుగా జరిగితే నవీన్ పోలిశెట్టి యొక్క స్వాతిముత్యం కూడా ఇదే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.రెండు సంవత్సరాలు గ్యాప్ ఇచ్చినందుకు ముచ్చటగా మూడు సినిమాలతో నవీన్ పోలిశెట్టి ప్రేక్షకుల ముందుకు రావడం ఆయన అభిమానులకు ఆనందాన్ని కలిగించే విషయం.