యంగ్ హీరో విశ్వక్సేన్ నటించిన దాస్ కా దమ్కీ మార్చి 22వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.ఆ సినిమా విడుదల తేదీ సమీపిస్తున్నా కూడా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టక పోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం అవుతుంది.
ఫిబ్రవరి నెలలోనే సినిమా ను విడుదల చేయాలని విశ్వక్సేన్ ప్రయత్నాలు చేశాడు.కానీ ఆ సమయంలో ఇతర సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండడంతో పాటు ఇతర కారణాల వల్ల వాయిదా వేయడం జరిగింది.
ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విశ్వక్సేన్ ఇప్పటి వరకు ప్రమోషన్ కార్యక్రమాలను స్పీడ్ పెంచక పోవడం పట్ల మరోసారి చిత్రం వాయిదా పడబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ సినిమా ను స్వీయ దర్శకత్వం లో విశ్వక్సేన్ నిర్మించాడు.
అంతే కాకుండా హీరోగా ద్వి పాత్రాభినయం చేసిన విశ్వక్సేన్ చాలా నమ్మకం పెట్టుకొని ఈ సినిమా ను నిర్మించినట్లుగా చెప్పుకొచ్చాడు.దాస్ కా దమ్కీ లోని పాటలు ప్రేక్షకులను అలరించాయి.
ఇప్పటికి కూడా ట్రెండ్ అవుతున్నాయి.సినిమా కి సంబంధించినంత వరకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది అనడం లో సందేహం లేదు.
ఇలాంటి సమయం లో భారీగా ప్రమోషన్ చేస్తే కచ్చితంగా ఫలితం ఉంటుంది.కానీ ఇప్పటి వరకు చిత్ర యూనిట్ సభ్యులు పబ్లిసిటీ విషయంలో సైలెంట్ గా ఉండడం పట్ల అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకీ విశ్వక్సేన్ ఈ మార్చి నెలలో తన సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడా లేదా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.మరో రెండు మూడు రోజుల్లో ప్రమోషన్ కార్యక్రమాలు షురూ కాకపోతే సినిమా వాయిదా పడ్డట్లే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ నెలలో మిస్ అయితే మంచి తేదీ కోసం చాలా వారాలు వెయిట్ చేయాల్సి రావచ్చు.







