మంచు మనోజ్ భూమా మౌనికల వివాహం ఎంతో ఘనంగా జరిగింది మార్చి మూడవ తేదీ వీరి వివాహం హైదరాబాద్ లోని ఫిలింనగర్లో మంచు లక్ష్మి నివాసంలో అత్యంత సన్నిహితులు ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది.ఇలా వీరి వివాహం జరిగిన మరుసటి రోజు మౌనిక దంపతులు, కర్నూలుకు చేరుకున్నారు.
అయితే నేడు ఈ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే తిరుమలలోని ఆలయం వెలుపల ఈ దంపతుల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మార్చి మూడవ తేదీ పెళ్లి చేసుకున్నటువంటి మనోజ్ మౌనిక అనంతరం కర్నూలుకు చేరుకొని తమ తల్లిదండ్రుల సమాధులను దర్శించి అక్కడ ఆశీర్వాదం తీసుకున్నారు.

ఇలా కర్నూలు నుంచి ఈ దంపతులు తిరుపతికి వెళ్లి అక్కడ శ్రీవారి దర్శనం చేసుకున్నారు.ఈ క్రమంలోనే ఆలయం వెలుపల మనోజ్ మౌనిక దంపతులు ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.ఈ క్రమంలోనే ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
అయితే మనోజ్ దంపతులతో పాటు మంచు లక్ష్మి దంపతులు వీరి కుమార్తె కూడా తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు.ఇ

క ఈ ఫోటోలలో మనోజ్ భూమా మౌనిక కుమారుడు ధైరవ్ రెడ్డిని ఎత్తుకొని కనిపించారు.క ఈ ఫోటోలలో మనోజ్ భూమా మౌనిక కుమారుడు ధైరవ్ రెడ్డిని ఎత్తుకొని కనిపించారు.ఇలా మనోజ్ ధైరవ్ రెడ్డిని ఎత్తుకొని కనిపించడంతో ఎంతోమంది అభిమానులు మనోజ్ మంచితనం పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
నిజానికి ధైరవ్ రెడ్డి మౌనిక తన మొదటి భర్తకు జన్మించిన కుమారుడు.ఈమెకు ఇదివరకే గణేష్ రెడ్డి అనే ఒక వ్యాపారవేత్తతో వివాహం జరిగిన విషయం తెలిసిందే.

అయితే బాబు పుట్టిన తర్వాత వీరిద్దరికీ మనస్పర్ధలు రావడంతో విడిపోయారు.ఇలా బాబు పుట్టిన తర్వాత మౌనిక మనోజ్ ప్రేమలో పడటంతో మనోజ్ కేవలం మౌనిక బాధ్యతను మాత్రమే కాకుండా తన కుమారుడి బాధ్యతను కూడా తీసుకున్నారు.ఇలా ఇన్ని రోజులు తండ్రి ప్రేమకు దూరమైనటువంటి ఆ చిన్నారిని మనోజ్ సొంత కొడుకులా ట్రీట్ చేస్తూ ఉండడంతో అభిమానులు కూడా మనోజ్ వ్యవహారి శైలి పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.







