సాధారణంగా ఎక్కడైనా రోడ్డు బారియర్లు ఇనుప కంచెలతో లేదంటే సిమెంటుతో, ఈ మధ్య ఫైబర్, ప్లాస్టిక్ లాంటివి వాటితో కూడా నిర్మితం అవుతున్నాయి.కానీ మహారాష్ట్రలో ఏర్పాటు చేసిన బారియర్ చూస్తే చాలా ఆలోచింపజేసిందిగా ఉంటుంది.
ఇది చూడడానికి జనాలను ఆకట్టుకోవడమే కాకుండా, పర్యావరణ హిత జాబితాలో ఏకంగా ప్రపంచ రికార్డు కొట్టేయడం విశేషం.కేంద్ర రహదారుల-రవాణా మంత్రి నితిన్ గడ్కరి తన ట్విట్టర్ ఖాతాలో దీనికి సంబంధించిన ఫొటోలు షేర్ చేయగా ప్రస్తుతం అవి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

ఇక అసలు విషయం ఏమంటే, ఈ కొత్త రకం ఆలోచనకు శ్రీకారం చుట్టింది ఆయనే.పూర్తిగా వెదురుతో తయారు చేసిన 200 మీటర్ల పొడవైన క్రాష్ బారియర్‌ను మహారాష్ట్రలోని ఓ హైవేపై ఏర్పాటు చేయగా దానిని జనాలు ఆసక్తికరంగా చూస్తున్నారు.ఈ తరహాలో క్రాషి బారియర్ ఏర్పాటు చేయడటం ప్రపంచంలోనే ఇది మొదటిదని గడ్కరి ఈ సందర్భంగా తెలిపారు.రాష్ట్రంలోని చంద్రపూర్-యవత్మాల్ జిల్లాలను అనుసంధానించే హైవేపై ఈ బాంబూ క్రాష్ బారియన్‌ను ఏర్పాటు చేశారు.

ఈ ఫొటోలు ఆయన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ “ఇది దేశానికి, వెదురు రంగానికి గొప్ప విజయం అని చెప్పుకోవాలి.వణి-వరోరా హైవేపైన ప్రపంచంలోనే మొదటి సరిగా 200 మీటర్ల పొడవైన వెదురు క్రాష్ బ్యారియర్‌తో అత్మ నిర్భర్ భారత్‌ను సాధించే దిశగా అసాధారణ విజయం సాధించాం!” అని గడ్కరి వరుస ట్వీట్లు చేయడం మనం గమనించవచ్చు.బాంబుసా బాల్కోవా వెదురుకు క్రియేసాట్ నూనెతో శుద్ధి చేసి రీసైకిల్డ్ హై-డెన్సిటీ పోలీ ఇథిలీన్‌తో పూత పూసి తయారు చేసినట్టు తెలిపారు.ఇది ఉక్కుకు ప్రత్యామ్నాయమే కాకుండా, పర్యవారణ ఆందోళనలకు పరిష్కారమని అన్నారు.







