మాస్ మహారాజా రవితేజ స్పీడ్ ను ఏ హీరో కూడా తట్టుకోలేడు.ఈయన వరుసగా నాలుగైదు సినిమాలు ప్రకటిస్తూ వాటిని ఒకదాని వెంట ఒకటి పూర్తి చేస్తూ జెట్ స్పీడ్ తో దూసుకు పోతుంటాడు.
ఇక రవితేజ ప్రెజెంట్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు.వరుసగా రెండు బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి కెరీర్ లోనే మంచి ఫామ్ లో ఉన్నాడు.

గత డిసెంబర్ లో ధమాకా సినిమాతో వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమా మాస్ రాజా కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.ఈ సినిమా విజయాన్ని రవితేజ ఎంజాయ్ చేస్తున్న తరుణంలోనే వాల్తేరు వీరయ్య రిలీజ్ అయ్యి అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.రవితేజ ఇక తన లైనప్ లో ఉన్న సినిమాల షూటింగులను పూర్తి చేస్తున్నాడు.
ప్రెజెంట్ రవితేజ లైనప్ లో ఉన్న చిత్రాల్లో ముందుగా రిలీజ్ కాబోతున్న సినిమా ”రావణాసుర”. ఈ సినిమాను సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు.ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి అయ్యింది.అది పూర్తి అయ్యి వారం కూడా గడవక ముందే మరో సినిమా షూట్ స్టార్ట్ చేసాడు.
రవితేజ కెరీర్ లో భారీ పాన్ ఇండియా సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’ ఒకటి.

డైరెక్టర్ వంశీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ముందు నుండి పాన్ ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలను క్రియేట్ చేసుకుంది.ఇక ఇప్పుడు వైజాగ్ లో వేసిన భారీ సెట్టింగ్ లో ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ చేసినట్టు మేకర్స్ తెలిపారు.ఈ మేరకు వీడియో కూడా రిలీజ్ చేసారు.
ఇక ఈ సినిమాకు జివి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా.అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు నిర్మిస్తున్నారు.
ఈ సినిమా కోసం రవితేజ భారీ కసరత్తులు కూడా స్టార్ట్ చేసాడు.







