బాలీవుడ్ నటి, మాజీ విశ్వసుందరి సుస్మిత సేన్ గత కొద్ది రోజుల క్రితం తీవ్రమైన గుండెపోటుకు గురైన విషయం మనకు తెలిసిందే.ఇలా ఈమె గుండెపోటుకు గురి కావడంతో వెంటనే వైద్యులు స్పందించి తనకు సర్జరీ నిర్వహించడంతో ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని తనకి ఎలాంటి ప్రమాదం లేదంటూ ఈమె తాను గుండె పోటుకు గురైన విషయాన్ని తెలియజేశారు.
అయితే తాజాగా మరోసారి ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు.ఈ వీడియో ద్వారా తనపై ప్రేమను చూపించిన అభిమానులకు చికిత్స అందించిన వైద్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ వీడియో ద్వారా సుస్మితాసేన్ మాట్లాడుతూ ప్రపంచంలో నలుమూలల నుంచి నేను ఎంతో ప్రేమను పొందుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను ముఖ్యంగా ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో నాకోసం దేవుడిని ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.ఇక ఈ వీడియోలో ఈమె వాయిస్ క్లియర్ గా లేకపోవడంతో వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా తన వాయిస్ క్లియర్ గా లేదని అయితే తాను క్షేమంగా ఉన్నానని తాను ఎలాంటి అనారోగ్య సమస్యలకు గురి కాలేదని ఈ విషయంలో ఎవరు ఆందోళన చెందకండి అంటూ కూడా తెలిపారు.ఇక గడిచిన గత కొంతకాలంగా చాలామంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు.అందుకే ప్రతి ఒక్కరు కూడా ఇతరులు పట్ల ప్రేమను చూపించండి ఈమె తెలిపారు.

ఇటీవల కాలంలో తాను తీవ్రమైన గుండెపోటుకు గురయ్యానని, ప్రధాన రక్తనాళం 95% మూసుకుపోయిందని ఈమె తెలియజేశారు.ఇలా తాను గుండెపోటుకు గురి కావడంతో ముంబైలోని నానావతి హాస్పిటల్లో చేరానని అక్కడ వైద్యులు ఇతర సిబ్బంది ఎంతగానో శ్రమించి తనకు సర్జరీలు నిర్వహించారని ఈమె తెలియజేశారు.నా కుటుంబసభ్యులు, ఆప్తులకు మాత్రమే ఈ విషయం తెలుసు.అయితే, చికిత్స పొందుతున్న సమయంలో ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పాలనుకోలేదు.చికిత్స పూర్తి అయ్యి ఆరోగ్యంగా కోలుకున్న తర్వాత ఈ విషయాన్ని నేను చెప్పడంతో చాలామంది తాను త్వరగా కోలుకోవాలని మెసేజ్ లు కామెంట్లు పెడుతున్నారు.ఇలా తనపై ఇప్పటికి ప్రేమను చూపిస్తున్న వారందరికీ మరోసారి ధన్యవాదాలు అంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







