ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విశాఖ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ” గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ “విజయవంతం గా ప్రారంభమైందని మొదటి రోజే 20 రంగాల్లో 13 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ముందుకు వచ్చారని దీని అంతటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ ఏ కారణమని పేర్కొన్నారు….ఇందులో భాగంగా ఆయన మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు….
ఈ పెట్టుబడులు వంద శాతం కార్య రూపం దాల్చకపోవచ్చనీ కాకపోతే కనీసం 100% వరకు అయినా వాస్తవరూపం లోకి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తామన్నారు….

ఈ సమ్మిట్ విషయమై ఇప్పటికే ప్రతిపక్ష టీడీపీ నుండి విమర్శలు వస్తున్న నేపథ్యంలో లో ఈ వ్యాఖ్యలు చేసారు.ఇటువంటి పరిస్థితి లో ఇలా విమర్శలు చేయడం దారుణమని, టీడీపీ తన హాయం లో ఒక్కసారి కూడా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇటువంటి స్థాయిలో ఎటువంటి కార్యక్రమం చేయలేదని పేర్కొన్నారు…అసలు ఆరోపణలు చేస్తున్న టీడీపీ అచ్చెన్నాయుడు కు అంబానీ , జిందాల్ అంటే ఎవరో కూడా తెలీదు అని ఎద్దేవా చేశారు….నిజానికి తాము 14 రంగాల పెట్టుబడుల పై దృష్టి పెడితే 20 రంగాల నుండి పెట్టుబడులు రావడం సంతోషకరమని ఇదంతా జగన్ పైన పెట్టుబడి దారుల నమ్మకమని చెప్పుకొచ్చారు….

అధికార ప్రతిపక్షాల వైఖరి ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగ యువత మాత్రం ఈ పెట్టుబడుల కారణం గా తమకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు.అయితే ప్రభుత్వం కాగితాల మీద చూపిస్తున్న లెక్కలన్నీ కాకి లెక్కలని కేవలం ఎనర్జీ రంగంలో ఇంతకుముందు కుదిరిన ఒప్పందాలని ఇప్పటి ఎంఓయువులుగా లెక్క గట్టి ప్రభుత్వం మాయ చేస్తుందని పారిశ్రామిక అభివృద్ధిపై ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని టిడిపి విమర్శలు నేపథ్యంలో అసలు ఎంవోలు కుదుర్చుకున్న లక్షల రూపాయల ఒప్పందాలలో ఏ మేరకు వాస్తవరూపం దాల్చుతాయో రానున్న కాలంలో తెలియనుంది.అధికార విపక్ష నాయకుల విమర్శ ప్రతి విమర్శలు ఎలా ఉన్నప్పటికీ, రాష్ట్ర భవిష్యత్తు కోసం పారిశ్రామిక అభివృద్ధి తప్పనిసరి కాబట్టి ఆ రకంగా రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుందాం.







